భారత దేశంలో భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడం ఒక నేరమనే చెప్పాలి. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే మాత్రం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాతనే రెండో పెళ్లి చేసుకునే వీలుంటుంది. లేనియెడల మొదటి భార్య అంగీకారం మేరకు రెండో పెళ్లి చేసుకునే వీలుంటుంది. భార్య, భర్తల బంధం బలంగా ఉండాలంటే వారు అనునిత్యం ప్రేమతో ప్రతీ విషయాన్ని నిర్మొహమాటంగా మనసు విప్పి మాట్లాడుకుంటే రెండో పెళ్లి చేసుకునే అవసరముండదు. అయితే భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో భర్త మరో స్త్రీతో చనువుగా ఉండడం.. లేదంటే మరో స్త్రీని పెళ్లి చేసుకోవడాన్ని ఏ భార్య కూడా సహించదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న చట్టాల్లో దాదాపు ఇవే నిబంధనలు ఉంటాయి.
ఆఫ్రికాలోని ఓ దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధమైన చట్టం ఉంది. ఇక ఆదేశంలో మాత్రం ఒక వ్యక్తి తప్పకుండా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. కాదు అని నిరాకరిస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవడానికి తన మొదటి భార్య నిరాకరిస్తే మాత్రం ఆమెకు శిక్ష తప్పదు. వాస్తవానికి ఇది వింటుంటేనే చాలా విచిత్రంగా ఉంది. అది వినగానే ఆదేశం ఎక్కడ ఉంది.. రెండు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణాలు ఏంటి..? అని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఒక్కోదేశానికి ఒక్కో చట్టాలు ఉంటాయి. దాదాపుగా అన్ని చట్టాలు ఒకే పెళ్లికి అనుమతిస్తుంటాయి. రెండవ పెళ్లికి మాత్రం నిరాకరిస్తుంటాయి.
Advertisement
ఇవి కూడా చదవండి : ఘనంగా అలీ కూతురు ఎంగేజ్మెంట్.. పెళ్లి కొడుకు ఎవరంటే..?
Advertisement
అయితే ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా దేశంలో విచిత్రమైన చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం.. ఆ దేశానికి చెందిన ప్రతీ పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. అక్కడి పురుషులు సంతోషంగానైనా, బాధతోనైనా ఎలా అయినా సరే కానీ మొత్తానికి రెండు పెళ్లి చేసుకోవడం అనేది తప్పనిసరి. పొరపాటున రెండో పెళ్లికి నిరాకరిస్తే మాత్రం జైలు శిక్ష తప్పదు. సాధారణ జైలు శిక్ష కాదండోయ్.. రెండవ పెళ్లి వద్దనుకున్న వ్యక్తికి ఏకంగా జీవిత ఖైదు విధిస్తారు. పురుషుల సంగతి అలా ఉంచితే.. ఇక స్త్రీల పైనా అయితే కఠిన చట్టాలుంటాయి. భర్త రెండో పెళ్లిని మాత్రం మొదటి భార్య అస్సలు ఆపలేదు. ఆమె ఆపేందుకు ప్రయత్నించినా కూడా ఆమెకు శిక్ష తప్పదు అని ఎరిట్రియా చట్టాలు పేర్కొంటున్నాయి. రెండో వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారికి ఆ దేశం చట్టం బాగుందని అనిపిస్తుంటుంది. కానీ దీనికి వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి : మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా..? ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోండి..!
ఆఫ్రికా ఖండంలో ఓ వైపు కరువు కాటకాలు, మరోవైపు అంతర యుద్ధాలతో భగ్గుమంటుంటాయి. ఇక ఎరిట్రియా దేశానికి కూడా అదే పరిస్థితి. ఇక ఎర్ర సముద్ర తీరంలోని ఎరిట్రియా జిబుటి, ఇథియోపియా, సూడాన్ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇథియోపియా దాడుల కారణంగా ఎరిట్రియా దేశానికి చెందిన పురుషులు ఎక్కువగా మరణిస్తుంటారు. దీంతో మహిళల సంఖ్య భారీగానే పెరిగిపోయింది. దాదాపు 36లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో యుద్ధాల కారణంగా భర్తలను కోల్పోయిన మహిళలు భారీ సంఖ్యలో ఉండడాన్ని ఆ దేశ ప్రభుత్వం గుర్తించింది. దీనికి పరిష్కారంగా ప్రతి పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం జనాభా పురుషులకు సమానంగా స్త్రీల సంఖ్య ఉన్నది. అయినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం ఆ చట్టాన్ని మార్చడానికి అంగీకరించడం లేదు. ముఖ్యంగా జనాభాను పెంచడానికి ఎరిట్రియా ప్రభుత్వం ఈ చట్టాన్ని వినియోగిస్తుందట. ఈ చట్టంతో కెన్యా పురుషులు ఎరిట్రియా పౌరసత్వం తీసుకొని రెండు పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేస్తుండడం విశేషం.
ఇవి కూడా చదవండి : ఎంత సంపాదించినా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అలవాట్లు తప్పక మానుకోండి..!