Home » “బాహుబలి”లో కాలకేయ “కిలికి” భాష సృష్టికర్త..7సార్లు జాతీయ అవార్డు పొందిన ఆ ప్రముఖుడి కొడుకేనా..?

“బాహుబలి”లో కాలకేయ “కిలికి” భాష సృష్టికర్త..7సార్లు జాతీయ అవార్డు పొందిన ఆ ప్రముఖుడి కొడుకేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా మందికి చిన్నచూపు ఉండేది. కానీ జక్కన్న కళా ఖండం నుంచి వచ్చిన బాహుబలి తర్వాత తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. అంతటి టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాతో బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే ట్రెండ్ క్రియేట్ చేశారు.. ఈ సినిమాలో ప్రతి అంశం ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.. ఇందులో చాలా మందిని ఆశ్చర్యపరిచిన క్లిప్పింగ్ ఏదైనా ఉందంటే కాలకేయుని భాష.. ఆ భాష పేరు కిలికి భాష. కాలకేయుడు చూడడానికి ఎంత భయానకంగా ఉన్న అతను మాట్లాడిన భాష మాత్రం అందరినీ ఆశ్చర్య పరిచింది.. ప్రధానంగా ఈ భాష సినిమాకి హైలెట్ అయిందని చెప్పవచ్చు.

Advertisement

also read:అంత బాధలో ఉన్న ఫ్యాన్స్ గురించి ఆలోచించిన ప్రభాస్.. ఎంతైనా ప్రభాస్ లెక్కే వేరప్పా..!!

Advertisement

మాహిష్మతి సామ్రాజ్యంకి, కాలకేయునికి మధ్య జరిగిన యుద్ధంలో ఈ కిలికి భాష అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇది అర్థం కాకపోయినా ఈ భాషను చూడ్డానికి చాలా మంది థియేటర్లకు వెళ్లరని చెప్పవచ్చు. మరి ఆ భాషను కనిపెట్టిన మహనీయుడు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.. కిలికి భాషలు సృష్టించిన రైటర్.. మదన్ కార్కి వైరముత్తు.. ఆయన ఒక స్క్రీన్ రైటర్, ఎంటర్ప్రెన్యూర్, లిరిక్స్ రైటర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రీసెర్చ్ అసోసియేట్. ఏడు సార్లు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న గీత రచయిత వైరముత్తు పెద్దకుమారుడు మదన్ కర్కి.. ఇతను క్విన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో పిహెచ్డి చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు.

ఆ తర్వాత ఇండస్ట్రీలో మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి తన అధ్యాపక వృత్తికి స్వస్తి పలికాడు. ఈ తరుణంలోనే బాహుబలిలో ఛాన్స్ రావడంతో మదన్ కిలికి భాషని సృష్టించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇలాంటి భాషను సినిమాల్లో సూచించడం ఇదే మొదటిసారి. ఈ భాష కోసం హిందీ, ఇంగ్లీష్,తమిళం, సంస్కృతం భాష నుండి కొన్ని అచ్చులు, హల్లులు, పోని టిక్స్ తీసుకొని ఈ భాష సృష్టించాడు. కొత్తగా 750 పదాలను కనిపెట్టాడు. ఈయన సృష్టించిన ఈ భాష ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. దీంతో మదన్ కార్కి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు.

also read:కోట శ్రీనివాసరావు పరిస్థితి మరీ దారుణం..అవకాశం ఇవ్వండి అంటూ ఎన్టీఆర్, మహేష్ బాబులను అడిగారట..!!

Visitors Are Also Reading