Home » కోట శ్రీనివాసరావు పరిస్థితి మరీ దారుణం..అవకాశం ఇవ్వండి అంటూ ఎన్టీఆర్, మహేష్ బాబులను అడిగారట..!!

కోట శ్రీనివాసరావు పరిస్థితి మరీ దారుణం..అవకాశం ఇవ్వండి అంటూ ఎన్టీఆర్, మహేష్ బాబులను అడిగారట..!!

by Sravanthi
Ad

ఒకప్పుడు ఇండస్ట్రీలో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు ఈ కాంబినేషన్లో వచ్చిన కామెడీ మాత్రం ఇప్పటికీ మర్చిపోలేం. ఇప్పటికీ వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే.. అలాంటి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్రకి అందం తీసుకువచ్చే మేటి నటుడు కోట.. ఆయన ఆర్టిస్ట్ గా 750 పైగా చిత్రాల్లో నటించి స్టార్ నటుడిగా పేరు పొందారు. ప్రస్తుతం ఆయనకు వయసు పెరగడంతో వివిధ సమస్యల కారణంగా సినిమాల్లో నటించడం లేదట.. కానీ కోట శ్రీనివాసరావు మాత్రం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఇండస్ట్రీ గురించి ఇప్పటి నటుల గురించి పలు రకాలుగా చెప్పుకొస్తున్నారు..

Advertisement

also read:మీ కంటి చూపు మంద‌గిస్తుందా..? భోజ‌నం చేసిన త‌రువాత ఈ ప‌నులు త‌ప్ప‌క చేయండి..!

Advertisement

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఖాళీగా కూర్చోలేక పోతున్నానని ఏమైనా అవకాశాలు ఉంటే ఇవ్వండి అంటూ నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరు కనిపించినా అడుగుతున్నారట. దీనికి ప్రధాన కారణం ఆయన ఇంట్లో కూర్చుంటే పొద్దు పోవడం లేదని ఖాళీగా ఉంటే పిచ్చెక్కుతోందని అందుకే ఏదైనా సినిమాలు నటించాలి అని అనుకుంటున్నానని దానికోసమే వారిని అవకాశాలు అడుగుతున్నానని తెలియజేశారు. మన కావలసినప్పుడు అడగడంలో తప్పులేదు అని అభిప్రాయపడ్డారు. ఇంకా ఎక్కడైనా మహేష్ బాబు కనిపిస్తే మాత్రం అవకాశం ఇవ్వాలని అడిగాడట, కానీ మహేష్ బాబు దీనికి బదులు ఇస్తూ మీలాంటి పెద్దవారు నన్ను అడగడం ఏంటి అంటూ అన్నాడట.

ఇక ఎన్టీఆర్, నాని ఇక ఎవరైనా స్టార్ హీరోలు నాకు ఎదురుపడితే సినిమాల్లో అవకాశం అడుగుతాను. అలా అడగడం లో ఏమాత్రం మొహమాట పడనని అడగడంలో తప్పులేదని చెప్పుకొచ్చారు.. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత చిత్రాల్లో కామెడీ ఉంటుందని, కానీ పాత సినిమాల్లో హాస్యం ఉండేదని, హాస్యంతో ఎక్కడైనా ఎవరి ముందైనా నవ్వుకోవచ్చు కానీ ఇప్పుడున్న కామెడీ అలా కాదని అన్నారు.. అప్పటి సినిమాలకు ఇప్పుడు సినిమాలకు తల్లిపాలకు, డబ్బా పాలకు ఉన్నంత తేడా ఉందని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు కోట.

also read:ఈ సమస్యలు ఉన్న వారు పొరపాటున కూడా జామ పండు తినరాదు.. ఇందులో 2వది చాలా ఇంపార్టెంట్..!!

Visitors Are Also Reading