Home » తీవ్ర అనారోగ్యంతో ఇళ‌య‌రాజా…ఈ వీడియోతో క్లారిటీ..!

తీవ్ర అనారోగ్యంతో ఇళ‌య‌రాజా…ఈ వీడియోతో క్లారిటీ..!

by AJAY

సంగీత ప్ర‌పంచంలో లెజెండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇళ‌య‌రాజా. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చి త‌న పాట‌లతో శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. తెలుగు,త‌మిళ భాష‌ల్లో ఇల‌య‌రాజా పాట‌ల‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే గ‌తేడాది ఇళ‌య‌రాజా అనోరోగ్యం భారిన‌ప‌డ్డారంటూ వార్తలు వ‌చ్చాయి. ఆయ‌న కూడా ఒక ఏడాది పాటు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇళ‌య రాజా అనోరోగ్యం భారిన ప‌డ్డార‌ని వెంటిలేట‌ర్ పై చికిత్స తీసుకుంటున్నార‌ని వార్తలు వ‌చ్చాయి.

ilayaraja

ilayaraja

అయితే తాజాగా కొత్త సంవ‌త్స‌రం వేళ నూత‌న ఉత్సాహంతో ఇళ‌య‌రాజా అభిమానుల మందుకు వ‌చ్చి తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ చెప్పారు. న్యూయ‌ర్ విషెస్ చెబుతూ ఇళ‌య రాజా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయ‌న ఎంతో హుషారుగా పాట‌లు పాడుతున్నారు. ఓ త‌మిళ పాట‌ను కారులో కూర్చుని ఎంతో ఎన‌ర్జీతో పాడారు. ఈ వీడియో చూస్తే ఇది వ‌ర‌కూ ఇళ‌య‌రాజా అనారోగ్యం భారిన ప‌డ్డారో లేరో కానీ ప్ర‌స్తుతం మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.

also read : BREAKING : ఆర్ఆర్ఆర్ మ‌రోసారి వాయిదా..అదే బాట‌లో రాధేశ్యామ్..?

దాంతో ఆయ‌న అభిమానులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న ఆరోగ్యం పై వ‌స్తున్న పుక‌ర్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని ఇళ‌య రాజా చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను కోల్పోయిన తెలుగు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లు ఇళ‌య రాజా అనారోగ్యం భారిన ప‌డ్డారంటూ వార్త‌లు రావ‌డంతో ఆందోళ‌న చెందాయి. కానీ ఆయ‌న ఆరోగ్యంతోనే ఉండ‌టంతో ఊపిరి పీల్చుకున్నాయి.

also read : తెలుగు యాంక‌ర్స్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?

Visitors Are Also Reading