Home » BREAKING : ఆర్ఆర్ఆర్ మ‌రోసారి వాయిదా..అదే బాట‌లో రాధేశ్యామ్..?

BREAKING : ఆర్ఆర్ఆర్ మ‌రోసారి వాయిదా..అదే బాట‌లో రాధేశ్యామ్..?

by AJAY
Ad

ముందు నుండి అనుకున్న‌దే జ‌ర‌గబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప‌డ‌నుంది. దీనిపై కాసేప‌ట్లో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ మూవీ క్రిటిక్ మ‌నోబాల విజ‌య‌బాల‌న్ తన సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో ఆర్ఆర్ఆర్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక సంక్రాంతి భ‌రిలో ఆర్ఆర్ఆర్ ఉండ‌ద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఇప్ప‌టికే ఢిల్లీలో పూర్తి స్థాయిలో థియేట‌ర్లు మూత ప‌డ్డాయి.

Advertisement

Advertisement

అంతే కాకుండా ప‌లు ఉత్త‌రాధి రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌కు 50శాతం సీటింగ్ పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. రీసెంట్ గా కూడా ఆర్ఆర్ఆర్ వాయిదా అంటూ వార్త‌లు వ‌చ్చాయి దానిపై ఓ మూవీ క్రిటిక్ తన‌కు రాజ‌మౌళి చెప్పార‌ని సినిమా వాయిదా వేసే ఛాన్స్ లేద‌ని అన్నారు. కానీ జ‌క్క‌న్న దానిపై స్పందించ‌లేదు. ఇప్పుడు కూడా రాజ‌మౌళి స్పందిస్తేనే సినిమా విడుద‌ల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ALSO READ :తెలుగు యాంక‌ర్స్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?

 

అంతే కాకండా అదే బాట‌లో రాధేశ్యామ్ కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ కు కూడా ఉత్త‌రాధిన అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు సినిమా విడుద‌ల చేస్తే న‌ష్టాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే రాధే శ్యామ్ కూడా వాయిదా వేసే ఆలోచ‌నలో చిత్ర యూనిట్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఇక సంక్రాంతి బ‌రిలో ఈ సారి అజిత్ హీరోగా న‌టించిన వాలిమై ఒక్క‌టే నిల‌వబోతున్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading