Home » Money : మీ చేతిలో డబ్బు నిలవాలంటే..ఇంట్లో వీటిని పెట్టుకోండి..ముఖ్యంగా ఆ ఫోటో…!

Money : మీ చేతిలో డబ్బు నిలవాలంటే..ఇంట్లో వీటిని పెట్టుకోండి..ముఖ్యంగా ఆ ఫోటో…!

by Bunty
Ad

 

Money : ప్రస్తుతకాలంలో డబ్బులు సంపాది సంపాదించడం చాలా కష్టంగా మారుతుంది. ఇక కొంతమంది చాలా సులభంగా డబ్బును సంపాదిస్తారు. కొంతమంది ఇళ్లలో డబ్బులు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు చేయకపోయినా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. కొంతమందికి అనుకోని ఖర్చులు ఎప్పటికప్పుడు వేధిస్తూనే ఉంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా కూడా డబ్బు నిలవదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇంట్లో డబ్బు నిలవదు. ఇంట్లో వాస్తు నియమాలు కచ్చితంగా పాటించినట్లయితే ఎప్పుడు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సంపదతో ఉండవచ్చు.

If you want to have money in your hand keep these at home

Indian business man counting cash banknotes of newly launched 100 rupees. Money counting concept for background.

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉత్తరం వైపు కుబేరుడు ఉండే స్థానంలో ఎలాంటి చెత్తాచెదారం వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి. అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉండాలి. ఈశాన్యం మూల పూజ గది ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంట్లో కుళాయి నీళ్లు లీక్ అవ్వకుండా దాన్ని చూసుకోవాలి. నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఇంట్లో ఆదాయం కూడా నిలవకుండా అవుతుందట. చాలామంది ఇళ్లలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసేయాలి. ఇంట్లో బెడ్ రూమ్ దగ్గర ఇనుప వస్తువులను ఉంచకూడదు. ధనం నిలవాలంటే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవాలి.

Advertisement

Advertisement

లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు, నగలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి ఆ బియ్యాన్ని కొన్ని మన దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు. కావున ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలాగే ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలి. నైరుతి దిశలో బీరువాలు, లాకర్లు పెట్టుకోవడం వల్ల డబ్బుకి కొదవ ఉండదు. ఆగ్నేయంలో వంటగదిని ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading