Home » ఆధార్ కార్డు హిస్ట‌రీ చెక్ చేసుకోవ‌డం ఎలాగో తెలుసా..?

ఆధార్ కార్డు హిస్ట‌రీ చెక్ చేసుకోవ‌డం ఎలాగో తెలుసా..?

by Anji
Ad

ఆధార్ కార్డు అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో కీల‌క‌మైంది. ఇది ముఖ్య‌మైన డాక్యుమెంట్ అనే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఏ ప‌ని కోసం వెళ్లినా త‌ప్ప‌నిస‌రి కావాల్సింది ఆధార్ కార్డు. ఎక్క‌డైనా నిత్య‌జీవితంలో ఈ డాక్యుమెంట్ లేనిది ప్ర‌స్తుతం ఏ ప‌ని జ‌ర‌గ‌డం లేదు. ఆధార్ కార్డును ఇత‌ర ముఖ్య‌మైన డాక్యుమెంట్ల‌న్నింటికీ అనుసంధానం కూడా చేస్తోంది ప్ర‌భుత్వం. ఆధార్ కార్డు అవ‌స‌రం ఇంత పెరుగుతున్న త‌రుణంలో మీరు ఎక్క‌డెక్క‌డ ఆధార్ కార్డు వాడుతున్నారు. అంత‌కు ముందు ఎక్క‌డ ఆధార్ కార్డు వాడార‌ని తెలుసునే విధంగా ప్ర‌జ‌ల‌కు యూఐడీఏఐ అవ‌కాశం క‌ల్పిస్తోంది.

Aadhaar can be made in regional language: Aadhar card Update अब आपकी भाषा  में होगा आपका Aadhaar Card, इस तरह तुरंत करें बदलाव - aadhaar card latest  update change name address mobile

Advertisement

ఆధార్ కార్డును వినియోగించ‌డం పెరిగిన నేప‌థ్యంలో మోసాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఎప్ప‌టిక‌ప్పుడూ ఆధార్ హిస్టరీని చెక్ చేసుకుంటుండాల‌ని యూఐడీఏఐ సూచిస్తోంది. ఎక్క‌డ మీరు మీ ఆధార్ కార్డును వాడుతున్నారు..? ఏ డాక్యుమెంట్‌ల‌కు దీనిని లింక్ చేస్తున్నారో..? ఎప్ప‌టిక‌ప్పుడూ తెలుసుకోవాలని సూచిస్తుంది. ఒక వేళ మీరు దీనిపై శ్ర‌ద్ధ తీసుకోక‌పోతే వేరే వాళ్లు మీ ఆధార్ కార్డు వాడ‌కాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశ‌ముంది. మీ ఆధార్ కార్డుతో మోసాలు చేసే ప్ర‌మాదం కూడా పొంచి ఉంది. ఈ త‌రుణంలో ఆధార్ కార్డు హిస్ట‌రీలని కూడా బ్యాంకు లావాదేవీల మాదిరిగా ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌రిశీలిస్తుండాలి.

Advertisement

ఆధార్ కార్డు హిస్ట‌రీని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

తొలుత ఆధార్ కార్డుకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ అయిన‌టువంటి uidai.gov.in కి వెళ్లి ఓపెన్ చేయాలి.
ఇది ఓపెన్ చేసిన త‌రువాత ఇందులో My aadhar option ను క్లిక్ చేయాలి.
అది క్లిక్ చేసిన త‌రువాత ఆధార్ స‌ర్వెసెస్ ఆప్ష‌న్‌కింద ఆధార్ అథెంటికేష‌న్ హిస్ట‌రీ వ‌స్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
అప్పుడు నూత‌న విండో తెరుచుకుంటుంది. దానిలో మీ 12 అంకెలు క‌లిగిన ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ న‌మోదు చేసి ఓటీపీ సెండ్‌పై క్లిక్ చేయాలి.
ఇక ఇప్పుడు మీ ఆధార్ కార్డుకు సంబంధించిన మొత్తం హిస్ట‌రీని డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. ఆ హిస్ట‌రీలో మీకు ఏదైనా అనుమానం ఉంటే వెంట‌నే స‌రిచేసుకోవ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే మీ ఆధార్ హిస్ట‌రీని చెక్ చేసుకోండి ఇలా.

Visitors Are Also Reading