ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండెపోటు. ఈ సమస్యకి శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండటమే ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ లేదా కొవ్వు కారణంగా చాలా మంది ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల మందులు, ఆహారపు అలవాట్లలో జీవనశైలిలో మార్పులతో అధిక కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకునేందుకు సహాయపడుతాయి. శారీరక శ్రమ చేయడం చాలా అవసరం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి మన వంటింట్లో మసాలా దినుసులు ఎంతో ఉపయోగపడుతాయి. మన పూర్వీకుల నాటి నుంచి మసాలా దినుసులను ఆయుర్వేదంలో ప్రముఖంగా ఉపయోగిస్తూ వచ్చారు. మన శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికి ఏయే మసాలా దినుసులు ఉపయోగపడుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : నిద్రించే టైంలో గురక విపరీతంగా వస్తుందా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement
దాల్చిన చెక్క :
కొలెస్ట్రాల్ తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. సిన్న మాల్డిహైడ్, సిన్నమిక్ యాసిడ్ అనే సమ్మెళనాలను కలిగి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తంలోని కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రణలో ఉంచేందుకు కూడా దాల్చిన చెక్క పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు దాల్చిన చెక్క టీ లేదా వంటల్లో అయినా దీనిని తీసుకుంటే మంచిది.
అల్లం :
గొప్ప ఔషద గుణాలు కలిగిన అల్లం మసాలా ఘాటుగా ఉండడమే కాదు.. ఎంత కొవ్వును అయినా కరిగించేస్తుంది. జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మెళనాలున్నాయి. యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధమనులలో ఫలకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
Advertisement
నల్ల మిరియాలు :
నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మెళనం ఉంటుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ నిలువ ఉండకుండా అడ్డుకుంటుంది. ఇంకా పిత్త ఆమ్లాల స్రావాన్ని పెంచుతుంది. ఆహారం జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్నందున ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెంతులు :
భారతీయులు తప్పనిసరిగా వంటల్లో ఉపయోగించే వాటిలో మెంతులు కూడా ప్రముఖమైనవి. సపోనిన్స్ అనే సమ్మేళనం ఉండడం వల్ల దీనికి కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంటుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు.. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. కడుపులో మంటలు తగ్గిస్తాయి. ఆరోగ్యపరంగా మాత్రమే కాదు.. అందానికి జుట్టు సంరక్షణకి ఉపయోగపడుతుంది. మెంతిపొడి జుట్టుకి పెట్టుకుంటే వెంట్రుకలకు పోషణ లభిస్తుంది.
Also Read : ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!
పసుపు :
సంప్రదాయ వైద్యంలో వేళ సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న స్పైసెస్ పసుపు. కర్కుమిన్ అనే సమ్మెళనం ఉంటుంది. మంటని తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకుంటుంది. కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు రుజువు చేసాయి. ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడంలో సహాయపడుతుంది.
Also Read : రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!