Home » తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. రెండోసారి భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్ ?

తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. రెండోసారి భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్ ?

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచు వారి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తర్వాత అంత క్రేజ్ ఉంది మంచు వారి కుటుంబానికి..! మంచు కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు హీరోలు చిత్ర పరిశ్రమలకు పరిచయమైన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని మంచు మనోజ్ మరియు మంచు విష్ణు ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తున్నారు.

Advertisement

ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా మంచు వారి ఇంట ఓ పండగ వాతావరణం నెలకొంది అని సమాచారం అందుతుంది. త్వరలోనే మోహన్ బాబు చిన్న కొడుకు అయినా మంచు మనోజ్ తండ్రి కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల కాలంలోనే అంటే మార్చి మాసంలో భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం మీరిద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం.

Advertisement

 

భూమా మౌనిక రెడ్డి, ఆమె మొదటి భర్తకు పుట్టిన కుమారుడ్ని కూడా మంచు మనోజ్ తన వద్ద ఉంచుకొని… అతడి బాగోగులు చూసుకుంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా భూమా మౌనిక రెడ్డి కూడా ప్రెగ్నెంట్ అయినట్లు సమాచారం అందుతోంది. మంచు వారి కుటుంబ సన్నిహితులు ఈ విషయాన్ని బహిర్గతం చేశారట. అయితే భూమా మౌనిక రెడ్డి మూడోనెల నిండిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తోంది.

Visitors Are Also Reading