మనం గోంగూర, తోటకూర పాలకూర వంటివి ఎక్కువగా వాడుతాం. ఆవాల ఆకులు కూడా వాడవచ్చు. ఇవి రుచికరంగా ఉంటాయి. అదేవిధంగా ఇమ్యూనిటినీ బాగా పెంచుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ పుస్కలంగా ఉండడం వల్ల శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి. మీరు కూరగాయలు, సూప్ లలో ఆవాల ఆకులను వేసుకుంటే అదనపు రుచి ఇస్తాయి. చలికాలంలో శరీర వేడిని పెంచుతాయి.
Advertisement
ఆవాల ఆకుల్లోని విటమిన్ కే గుండెను కాపాడుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. ఇందులో బైల్ యాసిడ్స్, జీర్ణ సమస్యలను పరిస్కరిస్తాయి. ఆకుల వల్ల కలిగే వేడి వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటికి పోతుంది. సాధారణంగా ఆకుకూరలు తినడం కంటి ఆరోగ్యానికి మంచిది. ఆవాల ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కళ్లను కాపాడుతాయి. దృష్టిలోపాలను సరిచేస్తాయి. ఆవాల ఆకులతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటిని ఎలా వండుకోవాలనే డౌట్ మనకు వస్తుంది. వాటిని ఎలా వాడాలో చూద్దాం. చలికాలంలో ఆవాల ఆకులతో పరోటా చేసుకోవచ్చు. బంగాళదుంపతో ఆలూ పరాఠా ఎలా తయారు చేస్తామో..అదేవిధంగా ఈ ఆకులతో కూడా పరాఠాను తయారు చేసుకోవచ్చు. ఆలూకి కొంత ఆకులను కలిపి చేసుకోవచ్చు.
Advertisement
రోజు ఉదయం టిపిన్ తీసుకుంటే శరీరం చురుకుగా ఉంటుంది. ఈ ఆకులను పులుసులు, పప్పుల పచ్చళ్లలో కూడా వాడుకోవచ్చు. మీరు పెరుగు, శనగపిండి, పేస్ట్ తురిమిన దోసకాయ తరిగిన పచ్చిమిర్చి వేసి కూడా ఆవాలు, బచ్చలికూర రైతు చేయవచ్చు. మనం దీనిని వెజిటబుల్ సలాడ్ లకు కూడా జోడించవచ్చు. అన్ని గ్రేవీలకు కొద్దిగా ఆవ ఆకులను జోడించినప్పుడే అవి మనకు అదనపు రుచిని ఇస్తాయి. ఆవనూనెను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు సొంతంగా ఆవ మొక్కలను పెంచవచ్చు. కొన్ని ఆవాలను మట్టి కుండీలో వేస్తే చాలు.. నాలుగు రోజుల్లో మొలకలొస్తాయి. నెలరోజుల్లో ఆవాల మొక్కలను పొందవచ్చు.