Home » యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ మేల్ యాంకర్లలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదిచుకున్నారు యాంకర్ ప్రదీప్. ఎంతో మంది యాంకర్లకు ఆఫర్లు తగ్గుతున్నప్పటికీ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీగా అవుతున్నారు. ముఖ్యంగా తన పెళ్లికి సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ వాటి గురించి స్పందించడానికి ప్రదీప్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఓ రాజకీయ నేత కూతురితో ప్రదీప్ పెళ్లి జరుగనున్నదని వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకుండానే ప్రచారం ఆగిపోయింది. 

Advertisement

అయితే ప్రస్తుతం ప్రదీప్ పెళ్లికి సంబంధించి మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. నవ్య అనే ఫ్యాషన్ డిజైనర్ ని ప్రదీప్ పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ఈమెకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబానికి చెందిన యువతి అని తెలుస్తోంది. ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్నప్పటికీ నవ్య సోషల్ మీడియాలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడరు. బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా క్యాస్టూమ్స్ డిజైన్ చేయడం ద్వారా నవ్య పాపులారిటీని సంపాదించుకున్నారు. 2023లో ప్రదీప్ నవ్య పెళ్లి జరుగనున్నదని త్వరలో ప్రదీప్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నదని సమాచారం. 

Advertisement

Also Read :  ఫస్ట్ టైం బేబీ బంప్ రివీల్ చేసిన ఉపాసన… ఆ అపోహలకు చెక్ పెట్టిందిగా!

Manam News

మరోవైపు ప్రదీప్, నవ్య కులాలు కూడా వేర్వేరు అని, ఒకరికొకరు ఇష్టపడడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారని తెలుస్తోంది. ప్రదీప్ పెళ్లికి సంబంధించి జరుగుతున్న ప్రచారం గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రదీప్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ సైతం ఆశిస్తున్నారు. మరోవైపు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరించడంత పాటు పలు టీవీ షోలను నిర్మించడం వల్ల భారీ స్థాయిలోనే ఆస్తులు సంపాదించారు. ప్రదీప్ కుటుంబానికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే. 

Also Read :  RRR నుంచి HIT 2 : ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్ట్..!

Visitors Are Also Reading