పప్పు దినుసులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. వాటిలో శనిగలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. రుచికరంగా కూడా పప్పు దినుసుల్లో అన్నింటికన్నా రుచిగా ఉంటాయి. ఇక శనగల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫోలేట్, యాంటి ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా నిండి ఉంటాయి. శనగలు ఆరోగ్య పరంగా మాత్ర పలు ప్రయోజనాలు అందిస్తాయి. అదేవిధంగా శనగలతో పాటు బెల్లం కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు శనగల్లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలున్నాయి. బెల్లంతో ఐరన్, మెగ్నీషియం తదితర వంటివి పుష్కలంగా లభిస్తాయి. మరోవైపు ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకుంటే మీరు తీవ్రమైన వ్యాధులకు దూరంగా ఉంటారు. మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మీ శరీరంలో రక్తం లేకపోవడంతో అనగా రక్తహీనతతో బాధపడుతున్నట్టయితే మొలకెత్తిన శనగలు, బెల్లం తినాలి. ఈ రెండు ఐరన్‌కు మంచి మూలాలు. దీని కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి. ఇది శరీరంలో రక్త హీనతను దూరం చేస్తోంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రోజు ఒక గుప్పెడు మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తీసుకుంటే మీ ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.మీ ఎముకలను బలంగా చేస్తుంది.
Advertisement
మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తినడం ద్వారా మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. మొలకెత్తిన శనగలు, బెల్లం తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మొలకెత్తిన శనిగల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపుకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణక్రియను కూడా సరిగ్గా ఉంచుతుంది. శరీర జీవక్రియ పెరిగి పలు సమస్యలు దూరం అవుతాయి.
Also Read :
ఎన్టీఆర్ చనిపోయేముందు ఫోన్ లో ఎవరితో మాట్లాడారు..? చంద్రబాబు దాచిన ఆ నిజాలేంటి..?
నిద్ర ఎక్కువగా పోతే అందంగా అవుతారా..? ఇది వాస్తవమో కాదో తెలుసుకోండి..!