Home » ఎన్టీఆర్ చనిపోయేముందు ఫోన్ లో ఎవ‌రితో మాట్లాడారు..? చంద్ర‌బాబు దాచిన ఆ నిజాలేంటి..?

ఎన్టీఆర్ చనిపోయేముందు ఫోన్ లో ఎవ‌రితో మాట్లాడారు..? చంద్ర‌బాబు దాచిన ఆ నిజాలేంటి..?

by AJAY
Ad

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌కు ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు దొర‌క‌డం అదృష్టం అనే చెప్పాలి. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి తెలుగు సినిమా స్థాయిని ఎన్టీఆర్ మ‌రో మెట్టు ఎక్కించారు. పౌరాణిక, జాన‌ప‌ద చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. కేవ‌లం న‌ట‌న‌తోనే కాకుండా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోనూ చురుకుగా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి అతిత‌క్కువ కాలంలోనే సీఎం కుర్చీపై కూర్చుకున్నారు.

Advertisement

సీఎం అయిన త‌ర‌వాత త‌న‌దైన స్టైల్ లో పాల‌న సాగించారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కాల‌ను ప్రారంభించి వారి హృద‌యాల‌లో స్థానం సంపాదించుకున్నారు. కానీ చివ‌రిరోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌కు దూరం అయ్యారు. రాజ‌కీయంగా ఒడిదుడుకులు ఎదురుకున్నారు. 1996 జ‌న‌వ‌రి 18న ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచారు. కాగా రీసెంట్ గా ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

Advertisement

అయితే ఈ విష‌యంపై సీనియర్ జ‌ర్న‌లిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో ఏదో శాపం ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. అందుకే ఎన్టీఆర్ నుండి ఉమామ‌హేశ్వ‌రి వ‌ర‌కూ ఆక‌స్మిక మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతే కాకుండా ఎన్టీఆర్ అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చ‌నిపోయే కొంత‌స‌మ‌యం ముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారికి ఫోన్ చేసి మిమ్మ‌ల్న క‌ల‌వాలి అని అడిగితే ఉద‌యం మాట్లాడుకుందామ‌ని ఎఎన్ఆర్ చెప్పార‌ని అన్నారు. అంతే కాకుండా అదే రోజు ఉద‌యం ఎన్టీఆర్ హ‌రికృష్ణ ఇంటికి వెళ్లాల‌నుకున్నారు ఈ రెండింటిలో ఏది జ‌రిగినా వేరేలా ఉండేది అన్నారు.

కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని చ‌నిపోయాక ముందు మూడు గంట‌లు కీల‌కం అని చెప్పారు. పోస్టుమార్టంలో రిపోర్ట్ అనుమానాస్ప‌దంగా ఉంద‌ని డాక్ట‌ర్ కుసుమ అభిప్రాయ‌ప‌డ్డార‌ని అన్నారు. చ‌నిపోయేముందు ముఖం నీలంగా మారింద‌ని విష‌ప్ర‌యోగం జ‌రిగితే లేదంటే స్లో పాయిజ‌న్ వాడితే అలా జ‌రుగుతుంద‌ని డాక్ట‌ర్ అన్నార‌ని చెప్పారు. కానీ చంద్ర‌బాబు అలాంటి వ్య‌క్తి గురించి ఇలాంటివి బ‌య‌ట‌కు వ‌స్తే ఆయ‌న ప‌రువు ఏం కావాల‌ని అంటూ దాచిపెట్టార‌ని చెప్పారు. ఆ రోజు నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే కొంద‌రి బ‌తుకులు బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ని చెప్పారు.

Visitors Are Also Reading