Home » నాగచైతన్య కొత్త ఇంటి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

నాగచైతన్య కొత్త ఇంటి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

అక్కినేని వారసుడిగా సినిమాలలోకి వచ్చిన యంగ్ హీరో నాగచైతన్య డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం వెబ్ సిరీస్, సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమ పెళ్లి చేసుకున్న చైతూ.. కొద్ది సంవత్సరాల తరువాత అకస్మాత్తుగా విడాకులు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 

Also Read :  వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మ‌త‌వుతున్న హీరోల‌కు లైఫ్ ఇచ్చిన సినిమాలు ఇవే..!

Advertisement

ముఖ్యంగా సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడ కూడా తన విడాకులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తెలుగుతో పాటు అటు హిందీలో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల ఉగాది సందర్భంగా నాగచైతన్య కొత్త ఇల్లు కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలోహాట్ టాపిక్ గా మారింది. నాగార్జున ఇంటికి దగ్గరలోనే ఓ స్థలం కొన్న చై తన అభిరుచికి తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కొత్త ఇంటి యజమానిగా మారాడు. తన కొత్త అపార్టుమెంట్ ను అత్యంత విలాసవంతమైన, సౌకర్య వంతమైనదిగా మార్చుకోవడానికి భారీగానే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.  నాగచైతన్య ప్రస్తుతం ఇంటి ధర రూ.15కోట్లు అట. కొత్తగా కొనుగోలు చేసిన అపార్టుమెంట్ లోని ప్రతీ అంగుళం కూడా తన సొంత అభిరుచితో లగ్జరీగా, స్టైలిష్ గా డిజైన్ చేయించుకున్నాడని సమాచారం. 

Advertisement

Also Read :  సుప్రీం సినిమా బుడ్డోడు గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసా..?

 

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చైతు కొన్న కొత్త ఇల్లు అతని తండ్రి నాగార్జున నివాసానికి సమీపంలో ఉంది. తన కుటుంబంతో తన సాన్నిహిత్యం కొనసాగిస్తూ.. తన ప్రియమైన వారికి ఎప్పుడూ దూరంగా ఉండకుండా అతను కోరుకున్నప్పుడల్లా వారి దగ్గరికీ వెళ్లే విధంగా నాగ్ ఇంటికి దగ్గరలోనే చైతు ఇల్లు తీసుకున్నాడని తెలుస్తోంది. సమంతతో విడిపోయిన తరువాత చైతన్య కొద్ది రోజుల పాటు నాగార్జునతో కలిసి ఉన్నాడు. ఇక ఆ తరువాత కొనుగోలు చేసి ఆ పనులన్నీ అయ్యేంత వరకు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేశాడు. ఇప్పుడు ఇంటి పనులు పూర్తి అవ్వడంతో ఉగాదికి గృహ ప్రవేశం చేశాడు. తన కొత్త ఇంటి ఫంక్షన్ కి పెద్దగా ఎవరినీ ఆహ్వానించలేదు నాగచైతన్య. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇక ఆ వ్యక్తి మరెవ్వరో కాదు. ప్రేమమ్ చిత్రంతో నాగచైతన్యకు హిట్ ఇచ్చిన దర్శకుడు చందు మొండేటి. ఈ విషయాన్నిసోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Also Read :  జూనియర్ ఎన్టీఆర్ కి సర్ ప్రైజ్.. అభయ్, భార్గవ్ లకు స్టార్ హీరోయిన్ గిప్ట్..!

Visitors Are Also Reading