Home » జూనియర్ ఎన్టీఆర్ కి సర్ ప్రైజ్.. అభయ్, భార్గవ్ లకు స్టార్ హీరోయిన్ గిప్ట్..!

జూనియర్ ఎన్టీఆర్ కి సర్ ప్రైజ్.. అభయ్, భార్గవ్ లకు స్టార్ హీరోయిన్ గిప్ట్..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. అదేవిధంగా ఈ చిత్రంతో హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు. తెలుగు సినిమా యొక్క ఖ్యాని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ పీరియాడికల్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటించిన విషయం విధితమే. 

Also Read :  Sir Movie Dialogues in Telugu: ధనుష్ ‘సార్’  సినిమాలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే డైలాగులు ఇవే..! 

Advertisement

సీత పాత్రలో అమ్ముడి అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్సకులకు బాగా చేరువైపోయింది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మంచి దోస్తీ కుదిరింది. సినిమాలతో బిజినెస్ లోనూ దూసుకెళ్తున్న అలియా తన పిల్లల కోసం కాన్షియస్ క్లాతింగ్ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన ఆర్ఆర్ఆర్ హీరోకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ కి దుస్తులను పంపించింది. 

Advertisement

Also Read :  వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మ‌త‌వుతున్న హీరోల‌కు లైఫ్ ఇచ్చిన సినిమాలు ఇవే..!

ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా షేర్ చేశారు తారక్. ఇక ఈ సందర్భంగా ఆలియాకి కృతజ్ఞతలు తెలియజేశారు. థాంక్స్ ఆలియా నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాలలో సంతోషాన్ని ఉంచుతుంది. నా పేరు మీద కూడా ఓ బ్యాగ్ చూడాలనుకుంటన్నా అని తెలిపాడు. దీనికి ఆలియా స్పందిస్తూ.. ‘నీకు మాత్రం ఈద్ స్పెషల్ దుస్తులు సిద్దం చేస్తానని, స్వీటెస్ట్ పర్సన్ థాంక్యూ’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ఆలియా పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :   ఆ స్టార్ తో జోడీ క‌ట్టాల‌నుంది..మహాన‌టి మ‌న‌సులోని మాట‌..!

Visitors Are Also Reading