Home » ‘సైమా’ అవార్డ్స్ లో శ్రీలీల వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

‘సైమా’ అవార్డ్స్ లో శ్రీలీల వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

ఎంతో ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక దుబాయ్ లో ప్రారంభమైంది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించేందుకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సైమా. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచి లక్ష్మీ ప్రధాన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తయింది.

Advertisement

ముఖ్యంగా నటీనటులకు ఇచ్చేటువంటి అవార్డుల్లో సైమా అవార్డ్స్ కూడా చాలా ప్రత్యేకమైనవి. అయితే శుక్రవారం సైమా అవార్డు ఫంక్షన్ లో ఎంతో మంది సినీ తారలు తలుక్కుమని మెరిశారు. ఇక్కడ సినీ తారల అందాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పవచ్చు. ఈ అవార్డు ఫంక్షన్ లో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హీరోయిన్ శ్రీలీలా.. పింక్ డ్రెస్సులో కుర్ర కారుకు చెమటలు పట్టించిందని చెప్పవచ్చు. అలాంటి శ్రీ లీలా వేసుకున్నటువంటి డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

చాలా వెరైటీగా సింపుల్ గా ఉన్నటువంటి ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసుకోవడానికి నెటిజన్లంతా సెర్చ్ చేస్తున్నారు.  అయితే అవార్డు ఫంక్షన్ లో శ్రీలీలా వేసుకున్న డ్రెస్ ఖరీదు చాలా తక్కువ అని తెలుస్తోంది. ఆమె వేసుకున్న పింక్ కలర్ డ్రెస్ ధర 36 వేల రూపాయలు అట.  సింపుల్ గా ఉన్న ఆ డ్రెస్ ధర అంతా ఉండడంతో నేటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. అయితే దుబాయ్ లో జరిగిన ఈ సైమా అవార్డు ఫంక్షన్ లో శ్రీలీలా ధమాకా సినిమాలో నటించిన నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే శ్రీ లీలా అగ్ర హీరోలు అందరితో నటిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 12కు పైగా సినిమాలు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ఎన్టీఆర్ అభిమాని అంతలా హర్ట్ కావడానికి కారణం ఏంటి ? ఎమోషనల్ నోట్ వైరల్..!

 Youtuber Harsha Sai : టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న యూట్యూబర్ హర్ష సాయి!

Visitors Are Also Reading