Home » Youtuber Harsha Sai : టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న యూట్యూబర్ హర్ష సాయి!

Youtuber Harsha Sai : టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న యూట్యూబర్ హర్ష సాయి!

by Bunty
Ad

కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అవుతున్న వ్యక్తి హర్షసాయి. ఎవరు, ఎక్కడ కష్టాల్లో ఉన్నా సరే అడగకముందే తాను అక్కడికి చేరుకొని వారికి డబ్బులు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, ఏదో ఒక సహాయాన్ని చేస్తూనే ఉంటాడు. ఇతనికి యూట్యూబ్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనికి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఐదు భాషలలో యూట్యూబ్ ఛానళ్లను ఓపెన్ చేసి లక్షలలో డబ్బులను సంపాదిస్తూ పేదలకు తన వంతు సహాయాన్ని చేస్తున్నాడు.

Youtuber Harsha Sai

Youtuber Harsha Sai

ఇతని వాయిస్ కు చాలా మంది ఫిదా అవుతారు. ఇతను సహాయం చేయడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రోత్సాహాన్ని నింపి సహాయం చేసేలా చేస్తూ ఉంటాడు. ఇతనికి సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తాజా ఇతనికి సంబంధించిన ఓ సినిమా టీజర్ లాంచ్ ఈనెల 17వ తేదీన జరగబోతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ కి సంబంధించి పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు దగ్గర బంధువు అయినటువంటి కల్వకుంట్ల వంశీదర్ రావు ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

Advertisement

Advertisement

గతంలో బిగ్ బాస్ లో హౌస్ లో సందడి చేసి ప్రేక్షకుల మనసు దోచినటువంటి మిత్రశర్మ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన సొంత బ్యానర్ అయినటువంటి శ్రీ పిక్చర్స్ మీద ఈ సినిమాని తెరరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. హర్ష సాయి తన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాని విడుదల చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఈ టీజర్ లాంచ్ జరగబోతున్నట్టు మిత్రశర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలియజేసింది. ఇక ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading