సాధారణంగా ఎండాకాలం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సీజన్ లో సపోటా పండ్లు విచ్చలవిడిగా లభిస్తాయి. ఈ సీజన్ సపోటా పండ్ల సీజన్ అనే చెప్పాలి. సపోటా పండును చికూ అని కూడా పిలుస్తుంటారు. తియ్యదనంతో పాటు అధికంగా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. చాలా రకాల వ్యాధులను దూరం చేస్తుంది. సపోటా జ్యూస్ ని ఎక్కువ మంది తీసుకుంటారు. సపోటా పండ్లను తినడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- తరుచూ సపోటా పండు తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.
- సపోటాలో ఉండే విటమిన్లు మన రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
- గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సపోటా కీలకపాత్ర పోషిస్తుంది.
- సపోటా పండ్లు తినడం వల్ల స్థూలకాయం లేదా ఊబకాయం వంటివి దూరం అవుతాయి.
- శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గించడంలో సపోటా అద్భుతంగా పని చేస్తుంది.
- జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు సపోటా చెక్ పడుతుంది.
Also Read : సింగర్ సునీత భర్త మీకు తెలుసా.. ?
- గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు సపోటా చాలా బాగా ఉపయోగపడుతుంది.
- మలబద్ధకాన్ని నివారించడంలో ఇది సూపర్ గా పని చేస్తుంది.
- సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
- సపోటాలో ఉండే ఖనిజాలు ఎముకలను దృఢపరుస్తుంది.
- ఇది బీపీని కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది.