Telugu News » Blog » Talapathi Vijay:అంత పెద్ద స్టార్ అయ్యుండి తల్లిదండ్రులకు అన్యాయం చేశారా..?

Talapathi Vijay:అంత పెద్ద స్టార్ అయ్యుండి తల్లిదండ్రులకు అన్యాయం చేశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

అటు కోలీవుడ్ ఇండస్ట్రీ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నటనా శైలితో ఎంతో పేరు తెచ్చుకున్నారు తలపతి విజయ్. అంతేకాదు ఈ రెండు ఇండస్ట్రీలో ఈ హీరోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి తలపతి విజయ్ ఈ మధ్యకాలంలో నటించిన వారీసు మూవీ తమిళ ఇండస్ట్రీలో ఎంతటి హిట్టు కొట్టిందో మనందరికీ తెలుసు. దాదాపుగా 200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు.

Advertisement

also read:సింగర్ సునీత భ‌ర్త మీకు తెలుసా.. ?

అయితే అంత పెద్ద ఈవెంట్ లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా జనవరి 2న వారీసు ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటుగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ తల్లి శోభన కూడా వచ్చారు . అయితే విజయ్ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చేసారు. ఈ సందర్భంలో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రులను ఏదో మొక్కుబడిగా పలకరించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే వార్తలపై తన తల్లి శోభనా కూడా స్పందించారు.

Advertisement

also read:స‌మంత పోస్ట్ కు స్పందించిన కోహ్లీ భార్య‌…ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వ‌డంతో వైర‌ల్..!

తాజాగా ఒక మీడియా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ యొక్క వేడుక వారీసు మూవీ కోసం జరిగిందని ఒక పెద్ద ఈవెంట్లో నా కుమారుడు నుంచి అంతకన్నా కోరుకునేది ఏముంటుందని ఆమె అన్నారు.. ఇదంతా పక్కన పెడితే గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒక రాజకీయ పార్టీని కూడా పెట్టారు. అయితే విజయ్ మాత్రం ఆ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇక అప్పటినుంచి విజయ్ కి తన కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది. మరి వీరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా లేవా అనేది విజయ్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

Advertisement

also read:RRR Oscar award 2023: ఆస్కార్ అందుకున్న RRR.. రికార్డు క్రియేట్ చేసిన “నాటు నాటు”..!!