Home » రేగు చెట్టు ఆకుల గురించి తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు..!

రేగు చెట్టు ఆకుల గురించి తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు..!

by Anji
Ad

మామూలుగా మీరు రేగు ప‌ళ్ల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారందరికీ తెలుసు. ప‌ల్లెల్లో చాలా విరివిగా ల‌భిస్తుంటాయి. సంక్రాంతి సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంటాయి. రోడ్ల వెంట, పంట పొలాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఈ చెట్లు క‌నిపిస్తుంటాయి. ప‌ట్ట‌ణాల్లో కూడా రైతు బ‌జార్ల‌లో, తోపుడు బండ్ల‌పై వీటిని విక్ర‌యిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో పోటాషియం, పాస్ప‌ర‌స్‌, ఐర‌న్, జింక్‌, మాంగ‌నీస్‌, యాంటి యాక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి.


రేగు పండ్ల‌ను తింటే వృద్ధాప్యం ప్ర‌భావం త‌గ్గుతుంటుంది. ఫ్రీ రాడిక‌ల్స్ దెబ్బ‌తిన‌కుండా ర‌క్షిస్తుంది. కేవ‌లం పండ్లు మాత్ర‌మే కాదు.. రేగు చెట్టు ఆకుల‌తో కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఈ ఆకుల్లో ఔష‌ద గుణాలు ఉన్నందున ఆయుర్వేదంలో వీటిని వినియోగిస్తుంటారు. గొంతునొప్పి, యూరిన‌రీ ఇన్‌ఫెక్ష‌న్ల‌తో పాటు ప‌లు ర‌కాలఅనారోగ్య స‌మ‌స్య‌ల‌కు రేగు ఆకులు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. రేగు ఆకుల‌ను డికాక్ష‌న్ రూపంలో లేదంటే పేస్ట్ రూపంలో కూడా వినియోగించ‌వ‌చ్చు. ఈ రేగు ఆకుల వల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Also Read :  ఆస్కార్ రేసులో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్.. ఖుషీ అవుతోన్న అభిమానులు..!

  • మీకు గొంతు నొప్పి స‌మ‌స్య ఉంటే రేగు ఆకులు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. ఈ ఆకుల‌తో క‌షాయం చేసి తాగాలి. రేగు ఆకుల‌ను తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. దానిని నీటిలో వేసి కాసేపు మ‌రిగించాలి. ఆ త‌రువాత ఒక గ్లాస్‌లో వ‌డ‌గ‌ట్టి చిటికెడు ఉప్పు, మిరియాల పొడిని క‌లపాలి. ఈ రేగు ఆకుల క‌షాయం తాగితే గొంతు నొప్పి త‌గ్గుతుంది.

Advertisement

  • మూత్ర సంబంధ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. యూరిన్ ఇన్‌ఫెక్ష‌న్ యూరిన్‌లో మంట‌గా అనిపించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు బాగా ప‌ని చేస్తాయి. గోరువెచ్చ‌ని నీటిలో జుజుబీ ఆకుల ర‌సాన్ని క‌లిపి తాగ‌వ‌చ్చు.

Also Read :  Finger personality test: మీ వేలి యొక్క ఈ 3ఆకారాలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు.. ఎలా అంటే..?

  • బ‌రువు అదుపులో ఉంచుకోవ‌చ్చు. మీరు లావుగా ఉండి బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటే రేగు ఆకుల‌ను తీసుకోండి. రేగు ఆకుల‌ను మెత్గా న‌ల‌గ్గొట్టి వాటిని రాత్రి అంతా నీటిలోఉంచాలి. ఈ నీటిని ఉద‌యం వ‌డ‌గ‌ట్టి ఖాళీ క‌డుపుతో తాగాలి. ఈ నీటిని కొన్ని రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తాగ‌డం వ‌ల్ల బరువు అదుపులో ఉంటుంది. శ‌రీరం కూడా నాజుకుగా ఉంటుంది.

  • గాయాలు మానడంలో రేగు ఆకులు దోహ‌ద‌ప‌డుతాయి. మీకు శ‌రీరంలో ఏ భాగంలో అయినా గాయం అయితే రేగు ఆకుల‌ను మెత్త‌గా రుబ్బుకోవాలి. ఆ పేస్ట్‌ను గాయం ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వాపు స‌మ‌స్య న‌య‌మ‌వుతుంది.

 

  • కంటి మొటిమ‌ల‌ను త‌గ్గిస్తుంది. మీ క‌ళ్ల‌లో మొటిమ‌లు లేదా కావిటీస్ ఉంటే మీరు రేగు ఆకుల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రేగు ఆకుల ర‌సాన్ని కంటి బ‌య‌టి భాగంలో రాయండి. ఇక ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా రేగు ఆకుల ర‌సం నేరుగా కంటి లోప‌లికి వెళ్ల‌కూడ‌ద‌ని గుర్తుంచుకోవాలి.

Also Read :  అబ్బాయిల్లో, అమ్మాయిలకు నచ్చని 6 అతి ముఖ్యమైన విషయాలు..అబ్బాయిలు ఓ లుక్కేయండి..!!

Visitors Are Also Reading