Home » ఆస్కార్ రేసులో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్.. ఖుషీ అవుతోన్న అభిమానులు..!

ఆస్కార్ రేసులో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్.. ఖుషీ అవుతోన్న అభిమానులు..!

by Anji

ద‌ర్శ‌క ధీరుడుఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘RRR’ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మ‌ల్టీస్టార‌ర్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు క‌లిసి న‌టించిన‌ ఈ చిత్రానికి ఒక శుభ‌వార్త అనే చెప్ప‌వ‌చ్చు. ఇది కేవ‌లం టాలీవుడ్‌కి మాత్ర‌మే కాదు.. యావ‌త్ భార‌తీయ సినిమా ప్రేమికుల‌కు, ప్రేక్ష‌కులంద‌రికీ ఇది శుభ‌వార్త‌నే. ఎందుకన‌గా.. ‘RRR’ సినిమాలో న‌టించిన జూనియ‌ర్ ఎన్టీర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల పేర్లు ప్ర‌స్తుతం ఆస్కార్ రేసులో ఉన్న‌ట్టు టాక్ విపిపిస్తోంది.


ఇక RRR మూవీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌డంతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘NETFLIX’ లో ఎక్కువ రోజులు ట్రెండింగ్ లో ఉండి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక కొద్ది రోజుల కింద‌టే ఈ చిత్రంలో న‌టించిన ఎన్టీఆర్‌కి ఆస్కార్ అవార్డు వ‌స్తుందని ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన వెరైటీ మ్యాగ‌జైన్ ప్ర‌స్తావించింది. తాజాగా అదే వెరైటీ మ్యాగ‌జైన్ RRR సినిమాని నామినేట్ చేసింది. తాజాగా మ‌రోసారి ఉత్త‌మ న‌టుడు కేట‌గిరిలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు, బెస్ట్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌మౌళికి, బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌గా దోస్తీ సాంగ్‌కి ఆస్కార్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తూ ఈ జాబితాని విడుద‌ల చేసింది.

Also Read :  ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వకుంటే హీరోయిన్ వాణిశ్రీ ఏమైపోయేదో తెలుసా..?


రాజ‌మౌళి రూపొందించిన RRR మూవీలో కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. వీరి న‌ట‌న కేవ‌లం భార‌తీయ ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే కాదు.. హాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌ను సైతం మెప్పించింది. ముఖ్యంగా పెద్ద‌పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్‌, ఇంట‌ర్వెల్ సీన్ చాలా అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించార‌ని వీరి న‌ట‌న‌కు ఆస్కార్ అవార్డు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు హాలీవుడ్ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read :  అమితాబ్ బచ్చన్ నుంచి చిరంజీవి వరకు.. ఈ స్టార్ నటుల ఫస్టు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading