Telugu News » Blog » Finger personality test: మీ వేలి యొక్క ఈ 3ఆకారాలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు.. ఎలా అంటే..?

Finger personality test: మీ వేలి యొక్క ఈ 3ఆకారాలతో మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు.. ఎలా అంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

కొంతమంది వ్యక్తిత్వ నిపుణులు మానవుని యొక్క చేతి వేళ్ల ద్వారా వారి స్వభావం, మనస్తత్వం, మేధస్సు,ఐక్యూ ఎలా ఉంది అనేది చెబుతుంటారు. వారి అభిరుచి, ఏ విషయానికి ఎలా స్పందిస్తారు, కృషి, పట్టుదల వీరికి ఉంటుందా, లేదా అనేది వారి వేళ్లను బట్టే చెప్పవచ్చు. మరి ఆ వేలు ఏ ఆకారంలో ఉంటే మనకు ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం..

Ads

1.స్ట్రెయిట్ ఫింగర్ షేప్ పర్సనాలిటీ


ఈ విధమైన వేలి ఆకారం ఉన్నవారు అబద్ధాలు అస్సలు చెప్పరు. అబద్దాలు చెప్పే వారు అంటే అస్సలు సహించరు. నీతి, నిజాయితీతో జీవిస్తారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి ఏదైనా చేయవచ్చు. ఏదైనా బాధ ఉంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వారిలోనే దాచుకుంటారు. చాలా బలమైన స్వతంత్రంగా జీవించగల వ్యక్తులు. ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేసే వరకు వీరు విరామం తీసుకోరు..

also read:ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వకుంటే హీరోయిన్ వాణిశ్రీ ఏమైపోయేదో తెలుసా..?

2.పాయింటెడ్ ఫింగర్ షేప్ పర్సనాలిటీ:

Ads


ఇలాంటి వేలి ఆకారం ఉన్న వారు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు.. వీరు లక్ష్యాలు, కలలను చాలా లోతుగా పరిశీలిస్తారు. వాటిని ఎలాగైనా నిజం చేసుకునే విధంగా ముందుకు వెళ్తారు. వీరు సమాజంలో ఎక్కువ నాయకత్వ, అధికార స్థానాలను పొందుతారు. ఇలాంటి వారు ప్రజలకు మేలు చేస్తారు కానీ వారి నుంచి వీరికి ఇబ్బందులు అనేకం వస్తాయని పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణులు తెలియజేస్తున్నారు.
3.మీకు నకిల్డ్ ఫింగర్ ఉంటే:


ఇలాంటి ఫింగర్ ఉన్నవారు చాలా ఓపెన్ మైండెడ్. వీరి మంచితనానికి హద్దులు ఉండవు. చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తులు. వీరికి ఏది సరైనది అనిపిస్తే దానికి కట్టుబడి జీవిస్తారు.వీరు మాట్లాడే మాటలు, దుస్తులు ధరించే విధానం చాలా బాగుంటుంది. ఏ పనినైనా నవ్వుకుంటూ కష్టంగా భావించకుండా చేస్తారని నిపుణులు అంటున్నారు.

Ad

also read:అమితాబ్ బచ్చన్ నుంచి చిరంజీవి వరకు.. ఈ స్టార్ నటుల ఫస్టు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?