Chanakya Niti : ఆచార్య చాణక్యుడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చాణక్యుడు దౌత్యవేత్త, ఆర్థికవేత్త, తన రాజకీయ వ్యూహాలతో చంద్రగుప్తమౌర్యను రాజును చేసిన గొప్ప మేధావి. ముఖ్యంగా చాణక్యను కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు వంటి బిరుదులున్నాయి. చాణక్యుడు తక్షశీల విశ్వవిద్యాలయంలో విద్యాబుద్దులు నేర్చుకుని అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మానవ జీవన విధానాన్ని గురించి క్లుప్తంగా వివరించాడు. ముఖ్యంగా ఎవరితో స్నేహం చేయాలి.. ఎవరితో దూరంగా ఉండాలి. పిల్లలను ఏ విధంగా పెంచాలి. భార్యభర్తలు ఎలా ఉండాలి..? స్త్రీలను ఎలా గౌరవించాలని చక్కగా అభివర్ణించాడు. ముఖ్యంగా సరైన జీవిత భాగస్వామి దొరికితే వారు ఎంతో సంతోషంగా గడుపుతుంటారు.
Advertisement
చాణక్య నీతి ప్రకారం.. అర్థం చేసుకునే భార్య దొరికితే ఆ ఇంట్లో ప్రశాంతత, సుఖసంతోషాలు ఉంటాయి. ప్రపంచంలో ఎవరికీ కీడు చేయని వారు ఎవరైనా ఉన్నారంటే తల్లి అని చెప్పవచ్చు. తల్లి ఎప్పుడూ చెడు చేయాలని చూడదు. స్త్రీలు నమ్మితే భాగస్వామి కోసం ఏదైనా చేస్తారు. స్త్రీలకు విద్యను నేర్పించినట్టయితే భావి తరాలకు ఆమె ఆదర్శంగా ఉంటుందని అందరినీ గౌరవిస్తుందని చెప్పాడు. ఆడవారు కుటుంబాన్ని గౌరవించడమే కాకుండా అందరితో ప్రేమగా మెదిలి అందరినీ బాగా చూసుకుంటుందని, విద్య నేర్పించినట్టయితే తరువాత తరాలకు కూడా అందిస్తుందని చెప్పాడు.
Advertisement
ఇక కుటుంబ పరువు, ప్రతిష్టలు కాపాడుతూ.. ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకుని ధైర్యంగా నిలబడుతుందని చెప్పాడు. స్త్రీల అందం కంటే గుణం చూడాలని అప్పుడూ ఎలాంటి పరిస్థితిలో అయినా మీ వెంటే ఉంటూ మీ ఎదుగుదలకు సహకరిస్తుంది. మంచి నడవడిక కలిగిన ఆడవారు కుటుంబ గౌరవాన్ని కాపాడి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నాడు. అందుకే అటువంటి వారు మీ జీవితంలో ఉంటే అసలు వదులుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. ఈ లక్షణాలు ఉన్న స్త్రీలతో గొడవలు వచ్చినా తగ్గి మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించాడు. ఇలాంటి ఆడవారిని గౌరవిస్తే మీ గౌరవం పెరగడంతో పాటు ఆర్థికంగా మంచి జరుగుతుందని వివరించాడు.
Also Read :
పెద్దదేవుడికి కొత్త కోడళ్ల పరిచయం.. అడవుల జిల్లాలో పెర్సపేన్ ఉత్సవం
చిరంజీవి ఇంట్లో….బాలకృష్ణ సినిమా షూటింగ్!