Home » మటన్ అధికంగా తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందా..? నిపుణులు ఏమంటున్నారంటే ?

మటన్ అధికంగా తింటే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందా..? నిపుణులు ఏమంటున్నారంటే ?

by Anji
Ad

ఈ రోజుల్లో ఎక్కువ మంది షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. మనిషిలోని లోలోపల కొరుక్కొని తినేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ వచ్చిన వారు ఎక్కువగా ఆలోచించే విషయం ఏంటంటే..? ఎలాంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా ఆలోచిస్తారు. మటన్ తింటే షుగర్ పెరుగుతుందా అనే సందేహం చాలా మందికి రావడం పక్కా.. నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

షుగర్ వ్యాధి ఉన్న వారికి చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్. ఇవి షుగర్ వ్యాధి ఉన్న వారి శరీరంలో ఎంత తక్కువగా పేరుకుపోతే అం మంచిది. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉండే వారు మటన్ ను తీసుకోకపోవడం చాలా మంచిది అని అంటున్నారు. రెడ్ మీట్, పొట్టేలు మాంసం, మే మాంసాన్ని తగ్గించడం చాలా ఉత్తమం. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండాలి. కానీ కొవ్వు అస్సలు ఉండకూడదు. మటన్ లో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. అది షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచుతుంది. అందుకే మటన్ తినాలనుకుంటే మాత్రం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకొని తినడం ఉత్తమం. ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading