హిందూ పురాణాల్లో శ్రావణ మాసం చాలా విశిష్టమైన మాసం. శ్రావణ మాస పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటాం. అందుకే దీనిని రాఖీ పౌర్ణమి అంటారు. అలాగే పౌర్ణమి రోజు బ్రాహ్మణులు కొత్త జంధ్యాలను ధరిస్తారు. అందుకే దీనిని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. ఎంతో విశిష్టమైన శ్రావణ పౌర్ణమి రోజు మనం చేసే పనులు మంచిని సంతరించుకుంటాయి. ఇవాళ మనం చేసే స్నానం ప్రాముఖ్యతను చోటు చేసుకుంటుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు మనం చేసేటటువంటి స్నానం ఏవిధంగా ఉండాలి. అందులో ఏయే పదార్థాలు వేస్తే జన్మజన్మల పాపాలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
Advertisement
మన ఏడు జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగాలంటే ఈ శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. బకెట్ నీళ్లలో పసుపు, గంధం, చిటికెడు కుంకుమ, అక్షింతలు కలుపుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయాలి. స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శ్రావణ మాస పౌర్ణమి రోజు ఈ పదార్థాలు కలుపుకొని చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మంగళకరమైన వస్తువులు కలపడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు. శ్రావణ మాస పౌర్ణమి రోజు యజ్ఞోపవీత ధారణ చేసే వాళ్లు, అలాగే రాకి కట్టించుకునే వాళ్లు రాఖీ కట్టే వాళ్లు అభ్యంగన స్నానం చేయాలి.
Advertisement
సూర్యుడు ఉదయించక ముందే ఈ అభ్యంగన స్నాన చేయాలి. ఉదయాన్నే లేచి పరిసరాలు శుభ్రంగా చేసుకొని ఈ అభ్యంగన స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శక్తిమంతమైన శ్రావణ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఐశ్వర్యాలు లభిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ అభ్యంగన స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. మన హిందూ పురాణాల్లో ఏదైనా పండుగ వస్తే.. అభ్యంగన స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అందుకే వీలు అయినంత వరకు ప్రతీ ఒక్కరూ శక్తివంతమైన శ్రావణ మాస పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో మంగళకరమైన వస్తువులను వేసి చేస్తే మేలు జరుగుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఐరన్ లోపం తో బాధ పడుతున్నారా..? వీటిని తీసుకోండి మరి..!