Home » 1998లో పరీక్ష రాస్తే.. రిటైర్మెంట్ ఏజ్ లో జాబ్ వచ్చింది..!

1998లో పరీక్ష రాస్తే.. రిటైర్మెంట్ ఏజ్ లో జాబ్ వచ్చింది..!

by Sravanthi Pandrala Pandrala
Ad

చదువు తల్లి నమ్ముకొని ఉద్యోగం వస్తేనే జీవితం బాగుపడుతుందని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది యువత మనకు ప్రతిరోజు తారస పడుతూనే ఉంటారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన, చివరికి పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ కోసం వేచి చూసి, చివరికి ఎక్కడో ఒక దగ్గర ఆ రిజల్ట్ పై కేసులు పడడం చివరికి అవి బయటకు రాక విరు ఉద్యోగాల కోసం ఎదురు చూసి వయసు అయిపోయి రోడ్డున పడ్డవారు వీధికి ఒక్కరు ఉన్నారు. కేదారేశ్వర రావు జీవితం బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 డీఎస్సీ పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్కార్ నిర్ణయంపై అభ్యర్థులు సంతోషించాలో లేదంటే బాధపడాలో అర్థం కావడం లేదట. ఎందుకంటే 1998 నాటి అభ్యర్థులు అంటే వారి వయసు దాదాపు 55 నుంచి 60 మధ్య ఉంటుంది. జాబ్ కోసం ఎన్నో సంవత్సరాలు ఉద్యమాలు,నిరసనలు, కోర్టు మెట్లు ఎక్కారు. ఇవ్వాల్సిన ఏజ్ లో జాబ్ ఇస్తే వారి లైఫ్ మరోలా ఉండేదని అంటున్నారు. దానికి ఉదాహరణ కేదారేశ్వర రావు జీవితమే. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసిదికి చెందిన 55 సంవత్సరాల కేదారేశ్వరరావు 1998లో డీఎస్సీ క్వాలిఫై అయ్యాడు. అప్పుడేదో కారణాలవల్ల అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రభుత్వం.

Advertisement

Advertisement

అయితే 24 సంవత్సరాల తర్వాత జాబు ఇచ్చేందుకు ఓకే చెప్పింది ఏపీ సర్కార్. ఇన్ని సంవత్సరాలలో కేదారేశ్వర రావు జీవితం అల్లకల్లోలం అయిపోయింది. ఆయనకున్న తల్లిదండ్రులు చనిపోయారు. పెళ్లి కాలేదు ఎక్కడ ఉండేవాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. సైకిల్ పై బట్టలు వేసుకొని, అమ్మేందుకు వెళితే ఎవరూ కొనేవారు కాదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక, పిచ్చివాడిలా మారిపోయాడు. అన్నమలైలో బిఈడి చదివిన కేదారేశ్వర రావు. చాలా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ పరిస్థితుల్లో జాబ్ వచ్చిందని తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం.

1994 లోనే ఆయనకు ఉద్యోగం రావాల్సి ఉండగా అప్పుడు కొద్దిపాటి లో మిస్ అయిందట. మళ్లీ 1996 లో కూడా ఉద్యోగానికి క్వాలిఫై అయ్యారట. అప్పుడు కూడా తీసుకోకపోవడంతో 1998 లో డీఎస్సీ పరీక్ష రాసి క్వాలిఫై అయిన తర్వాత ఏఓ కారణాల వల్ల ప్రభుత్వం ఆ రిజల్ట్ ను పక్కన పెట్టేసిందట. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అప్పటి రిజల్ట్ ను ఇప్పుడు బయటపెట్టడంతో అందులో కేదారేశ్వర రావు ఉద్యోగానికి అర్హత సాధించారు. దీంతో ఆయన అసలు ఉద్యోగం వచ్చిందని ఆనంద పడాలో , బాధ పడాలో అర్థం కావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించి ఇలాంటి ఎందరో అభాగ్యులకు జీవిత జీవితం ఇవ్వాలని కోరుకుందాం.

also read;

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఊహించ‌ని ఆటంకాలు ఎదుర‌వుతాయి

 

Visitors Are Also Reading