Telugu News » సౌత్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే..?

సౌత్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. ఈ సినిమాల కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అంటే ఎంత లెవల్లో సౌత్ సినిమాలు పేరు తెచ్చుకుంటున్నాయని అర్థం చేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే సౌత్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. మరి ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఒకసారి చూద్దామా..?కోలీవుడ్ హీరో విజయ్ తన ఒక్కొక్క సినిమాకు దాదాపుగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఆయన బీస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వలిమై మూవీ తో సూపర్ హిట్ కొట్టిన హీరో అజిత్ 105 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 64 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ 90 నుంచి 100 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.కే.జి.ఎఫ్ హీరో యష్ 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు 50 కోట్ల నుంచి 85 కోట్ల రూపాయల మధ్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి 70 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ 50 కోట్లు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ సినిమాలకు 40 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుత కాలంలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఇండస్ట్రీగా దక్షిణ భారతదేశాన్ని చెప్పుకోవచ్చు.

Ads

ALSO READ;

కళ్ళు చిదంబరం తో నటించడానికి ఒప్పుకోని శ్రీదేవి.. కారణం ఇదేనా..!!

పోసాని ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

 


You may also like