Home » పోసాని ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

పోసాని ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

పోసాని కృష్ణమురళి..ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సంచలన సినిమాలు,నవ్వించే పాత్రలు, గుర్తుండిపోయే కథలు. గత 30 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీతో విడదీయలేని సంబంధం ఆయన పెన వేసుకున్నారు. ఈయన పేరు చెబితే కొందరికి ఆపరేషన్ దుర్యోధన లాంటి ఎమోషన్ సినిమా గుర్తుకొస్తుంది. మరికొందరికి ఈయన కలం నుంచి జాలువారిన పవిత్ర బంధం, సీతయ్య లాంటి సినిమాలు వెంటనే మదిలోకి వస్తాయి. ఇంకొందరికి కామెడీ గుర్తుకొస్తుంది. ఎలా చేసినా కూడా వందకి 100% చేయడం పోసాని కి అలవాటు. రచయితగా, విలక్షణ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోసాని కి నాటకాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. పోసాని కి చిన్నప్పటి నుండి ముక్కుసూటిగా ఉండడం ఎవరైనా ఏదైనా అంటే కచ్చితంగా వాటికి సమాధానం చెప్పేవారు. ఈయన పరుచూరి దగ్గర ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ గా చేశాడు. 50 సినిమాలకు పైగా పనిచేశాడు. కేవలం 1500 రూపాయల జీతానికే ఆనాడు పరిచూరి దగ్గర పనిచేశారు. అల్లుడా మజాకా సినిమా కి కథ రాసి ఆ తర్వాత పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమించుకుందాం రా, గోకులంలో సీత లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి పది సంవత్సరాల్లోనే వంద సినిమాలు చేసి పరుచూరి బ్రదర్స్ తర్వాత ఫాస్టెస్ట్ రైటర్ గా పేరు తెచ్చుకున్నారు పోసాని. ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసి గుండె ఆపరేషన్ లకు సహాయం చేశారు. జీ తెలుగులో వచ్చే బతుకు జట్కబండి లో హోస్ట్ గా వ్యవహరిస్తూ అక్కడికి వచ్చే పేద వారికి తన రెమ్యూనరేషన్ నుండి కొద్ది అమౌంట్ ఇచ్చి వారిని కూడా ఆదుకునేవారు. చిత్రసీమలో ఎవరైనా సహాయం అని కోరితే కచ్చితంగా వారికి సహాయం చేస్తారు. ఆయన ఆస్తులు సుమారు 70 కోట్ల రూపాయల వరకు ఉంటాయని సమాచారం. ఇక లగ్జరీ కార్లు కూడా ఆయన పెద్దగా వాడరు. సాధారణ కారులు,సాధారణ జీవితానికి ఇష్టపడతారు. హైదరాబాద్ అలాగే పెదకాకాని లోని వ్యవసాయ భూములు, అలాగే సొంత నివాసాలు కూడా ఉన్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఆయన వెల్ సెటిల్డ్ అని చెప్పుకోవచ్చు. ఇలా టాలీవుడ్ చిత్రసీమలో రచయితగా,నటుడిగా, దర్శకుడిగా,నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తెలుగు నేల మీద తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

చిరంజీవి ఇంట్లో….బాల‌కృష్ణ సినిమా షూటింగ్!

కళ్ళు చిదంబరం తో నటించడానికి ఒప్పుకోని శ్రీదేవి.. కారణం ఇదేనా..!!

 

Visitors Are Also Reading