Home » ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా లో ఆ సీన్ కి సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ ..! లాజిక్ ఉందా ? అసలు

‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా లో ఆ సీన్ కి సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ ..! లాజిక్ ఉందా ? అసలు

by Anji
Ad

సినిమా అంటే అందులో హీరో పాత్ర ఎంత ముఖ్య‌మో హీరోయిన్ పాత్ర కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమాల్లో త‌ప్ప దాదాపుగా ఎక్కువ మొత్తం సినిమాల్లో అదే లాజిక్ ఉంటుంది. అలా సినిమాలో హీరో లేదా హీరోయిన్ లేకుండా ఉంటే ఆ సినిమాకు అర్థ‌మే ఉండ‌దు. దాదాపుగా సినిమా ముగింపు వ‌ర‌కు హీరో, హీరోయిన్ ఉండేవిధంగా చేస్తారు. సినిమాలో హీరో, హీరోయిన్‌ల‌తోనే మెప్పించే ఫినిషింగ్ ట‌చ్ ఉంటేనే ప్రేక్ష‌కులు సినిమా చూసిన‌ట్టు తృప్తి పొందుతారు. లేదంటే నిరాశ చెందుతారు.

Shyam Singha Roy' makers leave no stone unturned to promote Nani, Sai Pallavi and Krithi Shetty starrer | Telugu Movie News - Times of India

Advertisement

కొన్ని సినిమాల్లో మాత్రం హీరోయిన్ లేదా హీరో మ‌ధ్య‌లోనే మ‌ర‌ణించే సంద‌ర్భాలుంటాయి. సినిమా అనేది అంత‌సేపు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అలా హీరో మ‌ధ్య‌లో మ‌ర‌ణిస్తే వెంట‌నే హీరోను పుట్టించ‌డం.. వంటివి కొత్త‌గా క్రియేట్ చేస్తుంటారు. అలా సినిమాకు ఫినిషింగ్ ట‌చ్ ఉండేవిధంగా చేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నార‌ని అనుకుంటున్నారా..? తాజాగా మీమ‌ర్స్ ఒక కొత్త లాజిక్‌ను క‌నిపెట్టారు.

Nani on Eega 2: As a fan of Eega, I want the sequel - Movies News

Advertisement

అది హీరో నాని సినిమాలోనిదే ఆ సీన్‌. నాని న‌టించిన ఈగ సినిమా అంద‌రికీ గుర్తుంటుంది. గ్రాఫిక్ నేప‌థ్యంలో సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో నాని స‌ర‌స‌న స‌మంత హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిన‌దే. ముఖ్యంగా ఇందులో నాని కొద్ది సేపు మాత్ర‌మే క‌నిపిస్తాడు. మిగ‌తా సినిమా మొత్తం చిన్న జీవి ఈగ రూపంలో క‌నిపిస్తాడు. ఇందులో నాని బ‌తికి ఉన్న‌ప్పుడు స‌మంత‌ను ఇష్ట‌ప‌డుతాడు. ఇక ఆమె వెంట‌నే తిరిగేవాడు.

ఓసారి స‌మంత నానికి గుడిలో ప్ర‌సాదం పెడుతుంది. ఆ సినిమాలో ఆ హీరోయిన్ హీరోకి దేవుడు ప్ర‌సాదం పెట్ట‌డం వ‌ల్ల‌నే హీరో చనిపోయాడు అని క్రియేట్ చేశారు మీమ‌ర్స్‌. అదేవిధంగా ఇటీవ‌లే విడుద‌లైన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో కూడా ఇలాగే జ‌రిగింది. అంటూ మీమ‌ర్స్ లాజిక్‌ను బ‌య‌టికీ తీశారు. అందులో నాని కూడా కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌ర‌స‌న కృతిశెట్టి, సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌లుగా న‌టించారు. ఇందులో హీరోకు, హీరోయిన్ ప్ర‌సాదం పెట్ట‌డం వ‌ల్లే హీరో చ‌నిపోయార‌ని క్రియేట్ చేశారు.

దీంతో దీనిని మీడియాలో ఫ‌న్నిగా క్రియేట్ చేశారు మీమ‌ర్స్‌. నాని ఫోటోను పెట్టి.. ప్ర‌సాదం పెట్టి పైకి పంపిస్తున్నారు అమ్మ అని ఎడిట్ చేశారు. ఇక ఆ పోస్ట్‌కు వాళ్లు చంపిన నువ్వు జిడ్డులాగా పుడుతున్నావ్ క‌దా అని దారుణంగా కామెంట్ పెట్ట‌గా.. ప్ర‌స్తుతం ఈ మీమ్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్‌గా మారింది. ఇక నెటిజ‌న్లు కూడా ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. ఇలా కూడా లాజిక్‌ను క్రియేట్ చేస్తున్నారా అని పేర్కొంటున్నారు.

Also Read: My Story నాకు 40., త‌న‌కు 20.! ఇది మా స్టోరి!

Visitors Are Also Reading