Home » V V Vinayak : చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా విష‌యంలో ఆ త‌ప్పు చేయ‌క‌పోయి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది..!

V V Vinayak : చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా విష‌యంలో ఆ త‌ప్పు చేయ‌క‌పోయి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది..!

by Anji
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు వంటి ఫ్యాక్ష‌న్ సినిమాలు తీసి అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇక బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డి క‌న్న ముందే వెంక‌టేష్ న‌టించిన ప్రేమించుకుందాంరా.. సినిమాలో ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా అయిన‌ప్ప‌టికీ సూప‌ర్ హిట్ అయింది. ఫ్యాక్ష‌న్ సినిమాలంటే మాత్రం బాల‌కృష్ణ పెట్టింది పేరు. స‌మ‌ర‌సింహారెడ్డితో ప్రారంభ‌మై న‌ర‌సింహానాయుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన బాల‌కృష్ణ ఆ త‌రువాత తీసిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి మాత్రం ఆశించినంత విజ‌యాన్ని అందుకోలేదు.


ఇక అప్ప‌టికే మాస్ మ‌సాలా సినిమాల‌కు బాల‌య్య బ్రాండ్ అంబాసిడ‌ర్ ఉన్నాడు. ఇక ఆది లాంటి మాస్ స‌బ్జెక్ట్‌తో ఎన్టీఆర్‌తో సూప‌ర్ హిట్ అందుకున్నాడు వినాయ‌క్‌. వినాయ‌క్ లాంటి మాస్ డైరెక్ట‌ర్ తో బాల‌య్య సినిమా అన‌గానే అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. కానీ సినిమా ఫ్లాప్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఒప్పుకోరు. అభిమానులు మాత్ర‌మే కాదు.. జ‌న‌ర‌ల్ ఆడియ‌న్స్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అంటే అస‌లు ఒప్పుకోరు. బాల‌య్య సినిమాల్లో యాంటి ఫ్యాన్స్‌కి కూడా న‌చ్చిన సినిమా చెన్న‌కేశవ‌రెడ్డి. ఒక క్లాసిక్ సినిమాగా దీనిని సినిమా అభిమానులు వ‌ర్ణిస్తారు. ఇక అంత మంచి సినిమా ఫ‌లితం రాక‌పోవ‌డానికి కార‌ణాల‌ను వివ‌రించారు వినాయ‌క్‌.

Advertisement

Advertisement

ఇవి కూడా చ‌దవండి  :  హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు.. ఆ స్టార్ హీరో వారసుడితోనేనా..?


సినిమా కోసం ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ రైట‌ర్ అయిన ప‌రుచూరి సోద‌రుల్లో పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు తో ట్రావెల్ అయ్యాన‌ని వినాయ‌క్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఆయ‌న‌తో క్లోజ్‌గా ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న ఇన్‌పుట్ సినిమా కోసం తీసుకున్నాన‌ని అలా కాకుండా ఆయ‌న సోద‌రుడు ప‌రుచూరి గోపాల‌కృష్ణతో ట్రావెట్ అయి ఉంటే సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేదేమో అని అభిప్రాయ ప‌డ్డారు. ఇందుకు కార‌ణం ప‌రుచూరి గోపాల‌కృష్ణతో క‌లిసి ప‌ని చేసి ఉంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది అని వినాయ‌క్ భావించారు.

ఇవి కూడా చ‌ద‌వండి : వెంకటేష్ భార్య నీరజ గార్ల పెళ్లి వెనుకున్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

Visitors Are Also Reading