నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇక బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు సింహా, లెజెండ్, అఖండ అనే చెప్పవచ్చు. అంతకు ముందు బి.గోపాల్ దర్శకత్వంలో నరసింహానాయుడు ఎంతటి సంచలన విజయం సాధించిందో.. అదేవిధంగా బోయపాటి సినిమాలు కూడా ఇప్పటికీ అనుగుణంగా సూపర్ హిట్ సాధించడం విశేషం.
Advertisement
ఇదిలా ఉంటే.. ముఖ్యంగా లెజండ్ సినిమాత బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపి.. తన సత్తా ఏంటో చాటి చెప్పారు. ఈ మూవీలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు.. బాలయ్య డైలాగ్ లు ఇప్పుడు విన్నా.. చూసినా గూస్ బంప్స్ రావడం పక్కా.. ఈ మూవీలో బాలకృష్ణ తన చెల్లెలుని చూడటానికి వెళ్లిన సీన్ థియేటర్స్ లో ఆడియెన్స్ చేత విజిల్స్ కొట్టించింది. ఆడపిల్లల గురించి ఆ సన్నివేశంలో బాలయ్య చెప్పే డైలాగ్ సినిమా వన్ ఆఫ్ ది హైలెట్ అనే చెప్పవచ్చు.
Advertisement
అయిే ఈ సినిమాలో బాలయ్యను మామయ్య అంటూ చాలా ముDduగా పిలిచిన ఆ చిన్నారి మీకు గుర్తుకు ఉందా..? ఆ చిన్నారి ఎవరో మీకు తెలుసా..? ఆ పాప మరెవ్వరో కాదండోయ్.. దర్శకుడు బోయపాటి శ్రీను కూతురు జోషిత శ్రీను. ఇప్పటివరకు కూడా ఆ చిన్నారి దర్శకుడు బోయపాటి శ్రీను కూతురు అని చాలా మందికి తెలియకపోవచ్చు. బేబీ జోషిత తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జోషిత మామయ్య అని పిలవగానే.. బాలయ్య మురిసిపోవడం ఆడియెన్స్ ని ఆకట్టుకుందనే చెప్పాలి. అదేవిధంగా ఈ సినిమాలో బాలయ్య-జగపతి బాబు మధ్య యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ గానే నిలిచి సూపర్ డూపర్ హిట్ సాధించింది లెజెండ్ మూవీ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
చిరంజీవి సినిమానే భయపెట్టిన రవితేజ మూవీ.. ఫస్ట్ మూవీతోనే ఆ డైరెక్టర్ రికార్డు..!
వీళ్లు టాప్ విలన్స్ అయితే వీరి భార్యలు టాప్ హీరోయిన్స్ అనే విషయం మీకు తెలుసా ?