Home » సూపర్ స్టార్ కృష్ణ ఈనాడు చిత్రానికి 30 లక్షలు పెడితే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

సూపర్ స్టార్ కృష్ణ ఈనాడు చిత్రానికి 30 లక్షలు పెడితే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంతటి పేరు సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలు సామాజిక రాజకీయ అంశాలపై ఎక్కువగా వచ్చాయి. ఆ జోనర్లోనే ఎన్నో సినిమాలు తీసి హిట్టు కొట్టారు. ఇలాంటి మూవీలో హీరోయిజం చూపించే ఫైట్స్, పాటలు కాని ఉండవు. అలా తీసిన ఒక మూవీ ఈనాడు. ఇది సూపర్ స్టార్ కృష్ణకు 200వ సినిమా. ఇందులో కృష్ణ నటన హైలెట్ అని చెప్పవచ్చు. ఆయన కెరియర్ లోనే ఉత్తమ చిత్రంగా పేరు తెచ్చుకుంది.

Advertisement

అలాగే సినిమాలో హీరోయిన్ కూడా లేదు డ్యూయెట్స్ ఉండవు. అలాంటి ఓ సినిమాను తీసుకోవడం అంటే కృష్ణ ధైర్యానికి ఒప్పుకోవచ్చు. తనకు ఎంతో ఇష్టమైనటువంటి అల్లూరి సీతారామరాజు పేరే ఇందులో రామరాజుగా పెట్టుకున్నారు. 1982 జూన్ 9న చెన్నైలో షూటింగ్ మొదలైంది. అక్కడే చాలావరకు షూటింగ్ జరిగింది. ఆ తర్వాత గుంటూరు, తెనాలిలో షూటింగ్ చేశారు. క్లైమాక్స్ అంతా విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర రెండు రోజులపాటు చేశారు. మొత్తం ఈ సినిమాకు బడ్జెట్ 30 లక్షలతో, 35 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

Advertisement

1982 డిసెంబర్ 17న ఈనాడు మూవీ రిలీజ్ అయింది. కృష్ణ చెప్పే డైలాగ్స్,సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.. సాంబశివరావు డైరెక్షన్,రాఘవులు సంగీతం ఈనాడు సినిమాను మరో లెవెల్ లో ఉంచాయి. రండి కదలి రండి సాంగ్ అదిరిపోయింది. ఈ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం జరిగింది. దీంతో కృష్ణ ఎన్టీఆర్ ను అభినందిస్తూ పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. 30 లక్షలు పెట్టిన ఈ సినిమాకు అప్పట్లోనే రెండు కోట్ల వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

also read:

Visitors Are Also Reading