ఆంధ్రప్రదేశ్ లో జనసేన గ్రాఫ్ రోజురోజుకి విపరీతంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన సీటు కేవలం ఒక్కటే. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా లేదు. ప్రస్తుతం జనసేన జీరో అన్నమాట. అయితే ఇప్పుడు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జనసేన కఛ్చితంగా కొన్ని సీట్లను అయితే గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చారు. జగన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఒక్క సారి పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చి చూద్దామని జనాలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల లోపు జనసేన బాగానే పుంజుకునే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ కు సామాన్య జనాలు కాదు.. పలువురు ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు. చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది అంటున్నారు. మరోవైపు ప్రజా సమస్యలే అజెండాగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. చాలామంది రాజకీయ నాయకులు ప్రజల డబ్బు నే ప్రజలకు పంచుతారు. పవన్ కళ్యాణ్ మాత్రం తాను సంపాదించిన డబ్బును ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పంచుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ ని నడిపించడం కోసం సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు తన ఆస్తులను కూడా అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
Also Read : సోషల్ మీడియాలో రామ్ చరణ్ రికార్డు.. ఎందుకంటే..?
వాస్తవానికి సినిమాల ద్వారా ఎంతో సంపాదించుకునే అవకాశం పవన్ కళ్యాణ్ కు ఉంది. దానిని వినియోగించుకోకుండా కేవలం తన పార్టీని నడపటం కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవను, ఆయన పోరాడుతున్న తీరును చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కోసం, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మంచి జరుగుతుందని ఇటీవల పేర్కొన్నారట. ఈ విషయం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నే రాజకీయాల్లోకి రావాలని అందరూ పిలుస్తున్నారు. టీడీపీని టేకోవర్ చేసుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. మొత్తానికి ఏపీ లో పవన్ కళ్యాణ్ అధికారం లోకి వస్తాడో లేదో మరి ఎన్నికల వరకు వేచి చూడాలి.
Also Read : తనను దారుణంగా అమానించిన నటుడికే పిలిచి సాయం చేసిన శోభన్ బాబు…! ఆ నటుడు ఎవరంటే..?