Home » సోషల్ మీడియాలో రామ్ చరణ్ రికార్డు.. ఎందుకంటే..?

సోషల్ మీడియాలో రామ్ చరణ్ రికార్డు.. ఎందుకంటే..?

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంతటి సంచలన విజయం సాధించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు రామ్ చరణ్.

Also Read : బాల‌య్య సినిమాలో త్రిష.. రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..?

Advertisement

ఈ నేపథ్యంలో ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా చెర్రీ నిలిచాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా మాదిరిగా శంకర్ సినిమా కూడా అదేవిధంగా మరో స్థాయికి చేరుతుందని మెగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

Also Read : త‌న‌ను దారుణంగా అమానించిన న‌టుడికే పిలిచి సాయం చేసిన శోభ‌న్ బాబు…! ఆ న‌టుడు ఎవ‌రంటే..?

Advertisement

ఇక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లకు సంబంధించి టాలీవుడ్ హీరోలలో ఐకాన్ అల్లు అర్జున్ టాప్ లో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 19.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత ఆ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో రెండోస్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నాడు. 17.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో నిలిచిన మహేష్ బాబు 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఖాతాలో 8.9 మిలియన్ ఫాలోవర్లు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 4.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అతితక్కువ సమయంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కలిగిన హీరోగా చెర్రీ రికార్డు నెలకొల్పాడు. దీంతో చెర్రి అభిమానులు సంబురపడిపోతున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ చెప్పిన వినలేదు ! గుడుంబా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యిందట..!

 

Visitors Are Also Reading