Home » ఛాన్స్ ఇస్తే బాలయ్యతో అలా చేయాలని ఉంది.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఛాన్స్ ఇస్తే బాలయ్యతో అలా చేయాలని ఉంది.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

by Anji
Ad

నందమూరి నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వయస్సు ఆరు పదులు దాటినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపుతున్న హీరో. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కేవలం సినిమాలే కాదు.. రాజకీయాల్లో కూడా తనదైన స్టైల్ చూపిస్తున్నారు. అలాంటి బాలయ్య తాజాగా చేస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ చిత్రంలో ఫేమస్ హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. తాజాగా బాలయ్య భగవంత్ కేసరి మూవీ నుంచి తొలిపాట కూడా విడుదలైంది. 

Advertisement

ఈ సినిమాలో బాబాయ్ కూతురుగా బాలయ్య శ్రీలీల యాక్టింగ్ మామూలుగా లేదు. ఇటీవల విడుదలైన పాటతో వీరి డ్యాన్స్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా భగవంత్ కేసరి సినిమా గురించి బాలకృష్ణ గురించి చెప్పమని ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల ని  ప్రశ్నిస్తే..  ఈ విధంగా మాట్లాడింది.  బాలకృష్ణతో సినిమా అంటే తొలుత  చాలా భయపడ్డాను. కానీ  ఆయన చాలా కోపంగా ఉంటారని బయట అనుకునేవారు.  కానీ అదంతా ఉట్టి మాటలే అని, ఆయనతో షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు  అర్థమైంది.

Advertisement

 ఆయన తోటి నటులకు ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యపోయానని తెలియజేసింది శ్రీలీల. బాలయ్య సార్ బయట వేరు.. కెమెరా ముందుకు వస్తే వేరు అని చెప్పింది శ్రీలీల.  ఆయన ఒక్కసారి పాత్రలోకి ఎంటర్ అయ్యారంటే..  ఇక బాలకృష్ణ కాదని భగవంత్ కేసరి అని  తెలియజేసింది. ఆయన పాత్రలో చాలా లీనమవుతారని.. బాలకృష్ణతో చేస్తున్నంత సేపు నా సొంత బాబాయి లాగే అనిపించిందని వెల్లడించింది.  ఆయన కూడా తన సొంత కూతురు లాగే నన్ను చూసుకున్నారని తెలిపింది. అవకాశం వస్తే మళ్లీ బాలయ్య సార్ తో మరో సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయట పెట్టింది శ్రీ లీల. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ప్రభాస్ సలార్ మూవీ వాయిదా..? విడుదల అప్పుడేనా ?

JAWAN FIRST REVIEW : షారుఖ్ ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ .. ఎలా ఉందంటే ?

 

Visitors Are Also Reading