సోషల్ మీడియాలో నిత్యం పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి .. కొన్ని ఆలోచింపజేసేవి, మరికొన్ని షాకింగ్‌కు గురి చేసేవి ఉంటాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ అమ్మాయి పోల్ డ్సాన్స్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ వేధికగా ఇది చర్చనీయాంశంగా మారింది. లింగ పక్షపాత చర్చకు ఈ వీడియో దారి తీసింది. ,చివరకు ఇస్లామాబాద్ పోలీసులు ఆ యువతి మతి స్థిమితం లేని వ్యక్తి అని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారని వివరించారు. కానీ ఈ వీడియో తీసేవారు మాట్లాడిన మాటలపై కొందరూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.మరికొందరూ ఆమె అలా చేయడం సమంజసం కాదని కామెంట్ చేశారు. ఇంతకు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి బహిరంగ ప్రదేశంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అక్కడున్న సైన్ బోర్డు పోల్‌ను పట్టుకుని మరిచిపోయి ఆ యువతి డ్యాన్స్ మూమెంట్ చేసింది. ఇది చూసిన ఓ వ్యక్తి జూమ్ చేసిన వీడియో చిత్రీకరించాడు. ఆ తరువాత ఆమెను నిందిస్తూ.. దీనిని ఇస్లామాబాద్ పోలీస్ అధికారి అకౌంట్ ట్యాగ్ చేసాడు.
Advertisement
Advertisement
అసభ్యంగా ప్రవర్తించిన ఆ అమ్మాయిపై అవసరమైతే ఆ అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వేదికగా పోలీసులను డిమాండ్ చేశాడు. దీంతో అతడు తీసిన డ్యాన్స్ వీడియోతో పాటు అతని కంప్లైట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అమ్మాయి డ్యాన్స్ రహస్యంగా వీడియో తీసిన వ్యక్తి ని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరూ నెటిజన్లు స్వేచ్ఛగా డ్యాన్స్ చేసుకునే స్వతంత్రం కూడా లేదంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు.
A girl is bluntly enjoying low budget pole dance in I-8 Markaz Isd. the capital of Islamic Republic of Pakistan. is this what, the Pakistan's independence meant to be?@ImranKhanPTI @CMShehbaz @OfficialDGISPR #امپورٹڈ_حکومٹ_نامنظور #الیکشن_کمشنر_استعفی_دو #AamirLiaquatHussain pic.twitter.com/7qR9QBpKxG
— Zain Rebel (@ZainRebel777) May 17, 2022