Home » ఆ షో చేస్తుండగా హైపర్ ఆది ని మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

ఆ షో చేస్తుండగా హైపర్ ఆది ని మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హైపర్ ఆది అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించి ప్రస్తుతం కెరీర్ లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన స్కిట్ లలో వేసే పంచులు మాత్రం మామూలుగా ఉండవు. పంచు వేశారంటే పగలబడి నవ్వాల్సిందే. అంతటి నవరసాలను పండించగల కమెడియన్ అని చెప్పవచ్చు. అయితే తాజాగా హైపర్ ఆది ఒక షో చేస్తుండగా సడన్ గా పోలీసులు మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. హైపర్ ఆది ని అరెస్టు కూడా చేశారు. మరి అది నిజమా కాదా అనేది ఓ సారి చూద్దాం..?ఈ మధ్యకాలంలో ఫ్రాంక్ వీడియో ల పేరుతో సినిమా ప్రమోషన్ నిర్వహిస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నారు నటులు. తాజాగా జరిగినటువంటి విశ్వక్ సేన్ విషయానికి వస్తే నడిరోడ్డుపై పెట్రోల్ తో వాళ్లు చేసిన హంగామా చివరికి వార్తల్లోకెక్కింది. కేసుల వరకు వెళ్లింది. కానీ ఇదంతా ఫ్రాంక్ అని, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేశామని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో విశ్వక్ సేన్ ని కొందరు తప్పు పడితే మరికొందరు సమర్థించుకుంటూ వచ్చారు. ఇదే తరుణంలో హైపర్ ఆది ఒక టీవీ షోలో చేస్తుండగా సెన్సేషన్ క్రియేట్ చేసి అందరికీ టెన్షన్ పుట్టించారు. ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో లేటెస్ట్ ప్రోమో ని విడుదల కూడా చేశారు. నవ్వులతో సాగుతున్న ఈ షో క్లైమాక్స్ లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్ లో పోలీసులు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆది ని అరెస్టు చేశారు. అనుకోకుండా జరిగినటువంటి ఈ పరిణామానికి అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. కారు యాక్సిడెంట్ కేసులో ఆది ని అరెస్టు చేస్తున్నామని.. అతడి నిర్లక్ష్యం వల్ల ఒకరి చావుబతుకుల్లో ఉన్నారని పోలీసులు చెబుతారు. దీంతో ప్రోమో అయిపోతుంది. క్లైమాక్స్ లో ఈ సీన్ మాత్రం అందరినీ టెన్షన్ కు గురి చేస్తోంది. కానీ కొంతమంది ఇదంతా ఒట్టి ఫ్రాంక్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం షో ప్రమోషన్స్ కొరకే నకిలీ పోలీసులను ఇలా చేయించారని అంటున్నారు. డ్రైవింగే రాని ఆది ఎలా డ్రైవ్ చేశారని, ఇదంతా ఒట్టి యాక్టింగ్ అని, టిఆర్పి రేటింగ్ కోసం ఇలా చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ షో కు మొన్నటి వరకు సుడిగాలి సుధీర్, మరియు ఇంద్రజ జడ్జిగా వ్యవహరించారు. కానీ లేటెస్ట్ ప్రోమో లో మాత్రం వీరి స్థానంలో పూర్ణ మరియు రష్మి కనిపించారు.

Advertisement

ALSO READ;

Advertisement

బయోపిక్ కు డబ్బులు ఇస్తామన్న “మేజర్” నిర్మాతలు….సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఏమన్నారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

ఆ టాలీవుడ్ నిర్మాత‌తో శ్రీ‌రెడ్డి వివాహం..?

 

Visitors Are Also Reading