Home » ఎమ్మెల్యేగా హైపర్ ఆది.. అందుకే పవన్ ని కలిశాడా..?

ఎమ్మెల్యేగా హైపర్ ఆది.. అందుకే పవన్ ని కలిశాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి చాలా ఫేమస్ అయ్యారు హైపర్ ఆది. ఆయన కామెడీ టైమింగ్ పంచులు మామూలుగా ఉండవు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు సంపాదించుకొని సినిమాల్లో నటుడిగా చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినిమాల్లో ఆయన కామెడీ మనం చూసే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో హైపర్ ఆది ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి నుంచి హైపర్ ఆది కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు పెద్ద అభిమాని.

 

Advertisement

ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తప్పనిసరిగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పవర్ స్టార్ ను పర్సనల్ గా కలిశారట. ఎందుకు కలిశారు అనే విషయాన్ని కూడా ఆయన వివరించారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు మూవీ లో హైపర్ ఆది చిన్న పాత్ర చేస్తున్నారట, అందుకోసమే ఆయనను కలిశానని చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప మనిషి అని, డబ్బుపై అస్సలు ఆసక్తి ఉండదని అన్నారు. అలాంటి వ్యక్తి ప్రజలకు చాలా అవసరమని తెలియజేశారు. తన సొంత డబ్బును కౌలు రైతుల కోసం ఖర్చు పెడుతూ ఆదుకుంటున్నారని అన్నారు.

Advertisement

అలాంటి మంచి మనసున్న పెద్ద మనిషి కోసం ఏది చేయడానికైనా రెడీ అని అన్నారు. నాగబాబు గారు ఎలక్షన్ సమయంలో పిలిచి ఏదైనా పని చెప్పినా తప్పకుండా చేస్తానని ఆది చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విన్నటువంటి యాంకర్ ఎమ్మెల్యే గా ఛాన్స్ వస్తే పోటీ చేస్తారా అని అడిగారు. అబ్బో అలాంటిదేమీ లేదు ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తే ఏం చేస్తారు.. అని యాంకర్ అనగా వాళ్లు ఎంతో చూశారు, ఎంతో అనుభవజ్ఞులు అందుకే ఆ స్థాయిలో ఉన్నారు. అలాంటి అనుభవం నాకు కూడా కావాలి కదా అని బదులిచ్చారు.

ALSO READ;

కెరీర్ ప్రారంభంలోనే ఒకే ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టిన‌ నంద‌మూరి హీరో ఎవ‌రో తెలుసా..?

బాబు మోహ‌న్ ఉంటే ఆ సినిమాలో న‌టించమ‌ని చెప్పిన‌ కోటా, బ్ర‌హ్మానందం..!అలా ఎందుక‌న్నారు.?

 

Visitors Are Also Reading