Telugu News » Blog » బాబు మోహ‌న్ ఉంటే ఆ సినిమాలో న‌టించమ‌ని చెప్పిన‌ కోటా, బ్ర‌హ్మానందం..!అలా ఎందుక‌న్నారు.?

బాబు మోహ‌న్ ఉంటే ఆ సినిమాలో న‌టించమ‌ని చెప్పిన‌ కోటా, బ్ర‌హ్మానందం..!అలా ఎందుక‌న్నారు.?

by AJAY
Ads

టాలీవుడ్ లోని లెజండ‌రీ క‌మెడియ‌న్ ల‌లో బ్ర‌హ్మానందం మొద‌టి వ‌రుస లో ఉంటే ఆ త‌ర‌వాత బాబు మోహ‌న్ కూడా ఉంటారు. బాబు మోహ‌న్ ఒక‌ప్పుడు క‌మెడియ‌న్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల సినిమాల‌కు పూర్తిగా దూరం అయ్యారు. మొద‌ట నాట‌కాల్లో న‌టించిన బాబు మోహ‌న్ ఆ త‌ర‌వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆహుతి, అంకుశం సినిమాల్లో బాబు మోహ‌న్ న‌ట‌నకు మంచి గుర్తింపు వ‌చ్చింది.

Advertisement

 

 

అంతే కాకుండా మామ‌గారు సినిమాలో త‌న న‌ట‌న‌కు గానీ నంది అవార్డును సైతం అందుకున్నారు. ఇక చాలా సినిమాలలో కోట శ్రీనివాస్ బాబు మోహ‌న్ క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. వీరి పెయిర్ కు అభిమానులు ఉండేవారు. వీరిద్ద‌రూ క‌లిస్తే కామెడి కూడా చాలా భాగా పండేది.

Advertisement

కాగా బాబు మోహ‌న్ మొద‌టి సారి సౌంద‌ర్య ప‌క్క‌న్న చినుకు చినుకు అందెల‌తో పాటకు స్టెప్పులు వేశారు. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీనికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బాబు మోహ‌న్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. సౌంద‌ర్య ను బాబు మోహ‌న్ ప‌క్క‌న్న స్టెప్పులు వేస్తే కెరీర్ పోతుంద‌ని కొంద‌రు హెచ్చ‌రించార‌ట‌. కానీ సౌంద‌ర్య మాత్రం ఆయ‌న ప‌క్క‌న డ్యాన్స్ చేయ‌డం త‌న అదృష్టం అని సమాధానం ఇచ్చార‌ట‌.

 

ఇక ఈ పాట త‌ర‌వాత వ‌చ్చిన క్రేజ్ తో తాను 200ల‌కు పైగా పాట‌ల‌లో డ్యాన్స్ చేశానని బాబు మోహ‌న్ వెల్ల‌డించారు. అంతే కాకుండా ఆ త‌ర‌వాత బాబు మోహ‌న్ సినిమాలో ఉంటే మేం న‌టించం అని బ్ర‌హ్మానందం మ‌రియు కోటా శ్రీనివాస్ చెప్పేవార‌ట‌. దాంతో ద‌ర్శ‌కులు ఎవ‌రో ఒక హీరోయిన్ లేదా ఆర్టిస్ట్ తో త‌న‌కు ఓ పాట పెట్టేవారని చెప్పారు. ఇక చివ‌రికి దాస‌రినారాయ‌ణ‌రావు, రాజేంద్ర ప్ర‌సాద్ క‌ల్పిచుకుని మీరు ముగ్గురు క‌లిసి న‌టించాల‌ని చెప్పార‌ని అన్నారు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ త‌మ కాంబినేష‌న్ లో సినిమాలు వ‌చ్చాయిని చెప్పారు.

Advertisement

ALso read:గురువు అనే గౌరవం లేకుండా నితిన్ అలా చేశాడు..స్టేజ్ పైనే క‌న్నీళ్లు పెట్టుకున్న అమ్మారాజ‌శేఖ‌ర్..!