సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ కు విచిత్రం అయిన పంచాయితీ వచ్చింది. ఆస్తి తగాదాలు, భూమి, తగాదాలు, డబ్బు పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్ కు రావడం సహజం. కానీ ఇక్కడ ఇద్దరూ మహిళలు ఓ పిల్లి కోసం పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ అరుదైన పిల్లి కొరకు రెండు వర్గాలు మధ్య పొట్లాట కూడా జరిగింది. ఈ సమస్యను పరిష్కరించలేక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
Also Read : India Vs Newzealand Women : ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన రిచా ఘోష్
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన ముత్యాలమ్మ కొంత కాలం క్రితం మైసూర్నుంచి ఓ పిల్లిని తెచ్చుకుని పెంచుకుంటుంది. 15 నెలల క్రితం ఈ పిల్లి తప్పిపోయింది. పిల్లి కోసం ముత్యాలమ్మ వెతకని చోటు లేదు. ఈ పిల్లి కోసం ముత్యాలమ్మ పిల్లలు కూడా బెంగ పెట్టుకున్నారు. హుజూర్నగర్ పట్టణంలో ఉండే సుక్కమ్మకు ఈ పిల్లి దొరికింది. అప్పటి నుంచి ఈ అరుదైన పిల్లిని చాలా ప్రేమగా పెంచుకుంటుంది. ముత్యాలమ్మ పిల్లలు ఆడుకుంటూ సుమ్మక్క ఇంటి వద్ద ఉన్న పిల్లిని గుర్తుపట్టారు. ఈ పిల్లి మాది అని గొడవ చేసారు.
Advertisement
ఈ పిల్లిని రూ.5వేలకు కొనుగోలు చేశామని సుక్కమ్మ పేర్కొంటుంది. ఈ పిల్లి మాదంటే మాది అని పెద్ద గొడవకు దిగారు. చివరికీ ఈ పిల్లి పంచాయితీ హుజూర్నగర్ పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ పిల్లి పంచాయితి కోసం ఇరు వర్గాలకు చెందిన 50 మందికి పైగా పోలీస్ స్టేషన్కు వచ్చారంటే ఈ పిల్లి పంచాయితీ గురించి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పంచాయితినీ ఎలా పరిష్కరించాలో అర్థంకాక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ వింత అయిన పిల్లి పంచాయితి ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.
Also Read : Pandugappa Fish : చేపలకు రారాజు.. అంతర్జాతీయ మార్కెట్ లో భారీ డిమాండ్..!