చేపల్లోనే రారాజు పండుగప్పకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఇది పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంతంలో రైతులు పండుగప్పలను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పండగప్ప చేప సాగు తీర ప్రాంతంలో బాగా విస్తరిస్తోంది. రెండేడ్లుగా కరోనా చేపల సాగు అంతంతమాత్రంగానే ఉన్నది. కానీ గత రెండు నెలల నుంచి చేపల ధర పెరిగింది. దాంతో ఆక్వా రైతులు పండుగప్ప చేపల పెంపకం పై ఆసక్తి చూపుతున్నారు. సముద్రం, ఉప్పు నీటిలో దొరికే ఈ చేపలను జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం, భీమవరం, కాళ్ల మండలాలలో సాగు చేస్తున్నారు.
Advertisement
Also Read : పెళ్లి చేసుకోకుండానే పిల్లలకు జన్మనిచ్చిన సెలబ్రెటీలు వీళ్లే..!
ప్రస్తుతం సముద్రం ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో సుమారు 5వేల ఎకరాల్లో పండుగప్పను సాగు చేస్తున్నారు. మంచి ప్రోటీన్స్ ఉన్న పండుగప్ప చేపను తినేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పండుగప్ప ధరలు ఆశాజనకంగా పెరిగాయి. కిలో నుంచి రెండు కిలలోపు ఉన్న చేప రూ.320 రెండు నుంచి ఐదు కిలోల లోపు ఉంటే రూ.380 ఐదు నుంచి ఏడులోపు ఉంటే రూ.420, ఏడు కిలోలు దాటితే డిమాండ్ మరింత బాగుంది. బతికి ఉన్న చేపలను మాత్రమే ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత. రైతులు చెరువుల్లో బెత్తులు, చైనా గొరకలు వంటి చిన్నపాటి చేపలను ఆహారంగా వేస్తున్నారు. వీటిని పెంచేందుకు ఎక్కువగా ఉన్న ఎకరానికి చెరువులో రూ.500 నుంచి 700 వరకు పిల్లలను వదులుతారు. వీటిని చెరువులో ఏడాది పాటు పెంచితే పది కిలోల వరకు బరువు వచ్చే అవకాశముంటుంది.
Advertisement
రెండు ఎకరాలలో రొయ్యలు సాగు చేసే ఆక్వా రైతులు ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ఎకరాల్లో పండుగప్పను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్టుబడులు పోను రాబడి బాగుంటుందని రైతులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పండుగప్ప ధర కిలో రూ.480 చొప్పున పలుకుతోంది. ఈ చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బీహార్ తదితర ప్రాంతాలతో పాటు విదేశాకు పండుగప్ప ఎగుమతి చేస్తున్నారు. మరి ఇంకెందుకు మీరు కూడా పండుగప్పను రుచి చూడండి.
Advertisement
Also Read : India Vs Newzealand Women : ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన రిచా ఘోష్