Home » నయనతార గురించి భర్త విఘ్నేష్ శివన్ సంచలన కామెంట్స్.. అందుకోసమేనా ?

నయనతార గురించి భర్త విఘ్నేష్ శివన్ సంచలన కామెంట్స్.. అందుకోసమేనా ?

by Anji
Ad

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ని, పాపులారిటీని పెంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం రూ.10 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న నయనతారకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. క్రేజీ అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెళ్లి జరిగినా.. వయస్సు పెరుగుతున్నా నయనతారకు ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా విఘ్నేష్ శివన్ నయనతారను చూస్తే గర్వంగా ఉందని కామెంట్ చేయగా.. ఆ కామెంట్స్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. 

Advertisement

నయనతార జవాన్ మూవీలో నటించగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. జవాన్ మూవీలో నయనతార లుక్ ను షేర్ చేసిన విఘ్నేష్ నయన్ ని చూస్తుంటే ఆనందంగా.. గర్వంగా ఉందన్నారు. షారూఖ్ ఖాన్ కి అభిమానిగా ఆయన నటించిన మూవీస్ అన్ని చూసి నయన్ ఇప్పుడూ షారూఖ్ మూవీలో మెయిన్ రోల్ లో నటించిందని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. నయనతార మంచి సక్సెస్ సాధించాలని భావిస్తున్నట్టు తెలిపారు. నయన్ చాలా మందికి స్పూర్తిగా నిలుస్తున్నారని విఘ్నేష్ పేర్కొన్నారు. నయనతారను చూసి తాను మాత్రమే కాదని.. కుటుంబం అంతా సంతోషంగా ఉందని వెల్లడించారు విఘ్నేష్ శివన్. నయన్ విఘ్నేష్ కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Advertisement

విఘ్నేష్ శివన్ తో పోల్చి చూస్తే.. నయనతార సక్సెస్ రేటు ఎక్కువనే విషయం తెలిసిందే. నయనతార-విఘ్నేష్ లను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో నయనతార క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇక రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద నయనతార మరిన్ని సంచలనాలను సృష్టించనుందని అభిమానులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా నటించిన ఈ నటి ఎవరో తెలుసా ?

 సమంత, నిహారిక బాటలోనే మరో స్టార్ హీరోయిన్.. ఇది వాస్తవమేనా ?

Visitors Are Also Reading