Home » బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా నటించిన ఈ నటి ఎవరో తెలుసా ?

బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా నటించిన ఈ నటి ఎవరో తెలుసా ?

by Anji
Ad

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన తాజా మూవీ  బేబీ. ఈ సినిమా వీక్ డేస్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దర్శకుడు సాయి రాజేష్ నిజ జీవితంలోని పేర్లను ఈ మూవీలోని పాత్రలకు పెట్టడం గమనార్హం. ఈ చిత్రంలో హీరోయిన్ వైష్ణవి స్కూల్, కళాశాల ఫ్రెండ్ రోల్ లో కుసుమ నటించిన విషయం తెలిసిందే.

Advertisement

కొన్ని సీన్లలో కనిపించినప్పటికీ..  అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కుసుమ. బేబీ మూవీకి సోమవారం రోజు రూ.7.5 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చినట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ మూవీకి రూ.31కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ రోజు కంటే కూడా మూడో రోజు ఈ మూవీకి కలెక్షన్లు ఎక్కువగా రావడం విశేషం. యూత్ కనెక్ట్ కావడం వల్లనే బేబీ మూవీ భారీ స్థాయిలో లాభాలు సాధ్యం అవుతున్నాయని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వైష్ణవి ఫ్రెండ్ రోల్ లో నటించిన అమ్మాయి పూర్తి పేరు కుసుమ డేగల మర్రి కాగా.. సినిమాలో ట్రెడిషినల్ గా కనిపించినా రియల్ లైఫ్ లో గ్లామరస్ కనిపించడానికి ఇష్టపడుతున్నారు. పలు షార్ట్ ఫిలీంస్ లో నటించిన కుసుమ సినీ కెరీర్ బేబీ మూవీతో ప్రారంభమైంది. ఆర్య3 షార్ట్ ఫిలింతో మంచి పేరు తెచ్చుకున్న కుసుమకు సోషల్ మీడియాకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కుసుమ మరింత సక్సెస్ కావడం ఖాయమని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. కుసుమ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. కుసుమ డేగల మర్రి కెరీర్ ప్లానింగ్ రాబోయే రోజుల్లో ఏవిధంగా ఉండనుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరోయిన్ నందిత శ్వేత అంత లావు కావడానికి కారణం ఏంటో తెలుసా ? 

సమంత, నిహారిక బాటలోనే మరో స్టార్ హీరోయిన్.. ఇది వాస్తవమేనా ?

Visitors Are Also Reading