Home » సమంత, నిహారిక బాటలోనే మరో స్టార్ హీరోయిన్.. ఇది వాస్తవమేనా ?

సమంత, నిహారిక బాటలోనే మరో స్టార్ హీరోయిన్.. ఇది వాస్తవమేనా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్లు కొంతమంది పెళ్లిలు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. అలా విడాకులు తీసుకున్న వారిలో నాగచైతన్య-సమంత, నిహారిక-చైతన్య దంపతులు ఉన్నారు. తాాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ కూడా చేరింది. ఆమె మరెవ్వరో కాదు.. కలర్స్ స్వాతి. ఈమె బుల్లితెర నుంచి వెండి తెరకు అక్కడ నుంచి పలు దక్షిణాది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Advertisement

ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది స్వాతి. 2018లో తన బాయ్ ఫ్రెండ్ వికాస్ వాసును పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. తాజాగా స్వాతి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని భావిస్తే అందుకు సంకేతంగా తొలుత సోషల్ మీడియాలో తమ పార్ట్ నర్ కి సంబంధించిన ఫొటోలు తొలగించడం, ఇంటిపేరును మార్చుకోవడం వంటివి చేస్తున్నారు. నాగచైతన్య-సమంత, నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విషయంలో ఇలాగే జరిగింది. ఆ తరువాత కొన్ని రోజులకు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. స్వాతి కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో తన భర్త ఫొటోలను తొలగించిన విషయం విధితమే. 

Advertisement

గత కొంత కాలంగా తన భర్త వికాస్ కి దూరంగా ఉంటుందని.. తాను కూడా విడాకులు తీసుకోబోతుందని పలు యూట్యూబ్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే స్వాతి కూడా సోషల్ మీడియాలో తన భర్తకు సంబంధించిన ఫొటోలను తొలగించిన విషయం తెలిసిందే. అయితే స్వాతి వివాహ బంధం గురించి ఇలా ప్రచారం జరగడం ఇది తొలిసారి ఏమి కాదు.. రెండేళ్ల కిందట కూడా స్వాతి విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరిగింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో భర్త ఫొటోలు తొలగించడంపై అప్పట్లోనే క్లారిటీ ఇస్తూ.. వీడియో పోస్ట్ చేసింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ.. ఆ ఫొటోలతో చిన్న వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో విడాకులకు సంబంధించి రూమర్స్ కి బ్రేక్ వేసినట్టయింది. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు  : 

హీరోయిన్ నందిత శ్వేత అంత లావు కావడానికి కారణం ఏంటో తెలుసా ? 

పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా ? 

 ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాత ఐఫోన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading