నార్త్ వెస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 238 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
also read:సూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా?
Ad
Advertisement
ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఈ పోస్టులు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను సమర్పించాలి. మే 6వ తేదీ 2023 వరకు దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. అభ్యర్థుల యొక్క వయసు 15 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అయి ఉండాలి.
also read:ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్..!
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , రాత పరీక్ష సర్టిఫికెట్ల పరిశీలన మెడికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏవన్ గా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. పూర్తి వివరాలకు http://www.rrcjaipur.in/ వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.
also read:Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!