Home » ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్..!

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో గోపిచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత ఈయన హీరోగా ఎంట్రి ఇచ్చారు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తరువాత విలన్ గా మారి ప్రేక్షకులను మెప్పించారు గోపిచంద్. ముఖ్యంగా జయం, వర్షం, నిజం సినిమాల్లో తన విలనిజాన్ని చూపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ తరువాత యజ్ఞం మూవీతో హీరోగా మారి మంచి సక్సెస్ సాధించారు. ఆ తరువాత వరుసగా  సినిమాలు చేసి మెప్పించారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న యాక్షన్ హీరో తరువాత ఫ్లాప్ లను చవి చూడాల్సి వచ్చింది. 

Also Read :  ఇదేందయ్యా ఇది… 65 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయితో మేయర్ పెళ్లి

Advertisement

వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిలయ్యాయి. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా గోపిచంద్ మాత్రం సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మే 05న రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో గోపిచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం, చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీవాస్ ఈ మూవీని తెరకెక్కించాాడు. దీంతో ఈ మూవీతో హ్యాట్రిక్ విజయం ఖాయమంటున్నారు అభిమానులు. జగపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement

Also Read :   Balagam : తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న…

Manam News

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉన్నారు గోపిచంద్. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపించంద్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ లో మంచి అంచనాలు పెట్టుకొని ఫ్లాప్ అయిన సినిమా గౌతమ్ నంద అని తెలిపారు. మంచి కథతో తెరకెక్కిన ఆ మూవీ ఫ్లాప్ అవుతుందని అస్సలు ఊహించలేదన్నారు. గౌతమ్ నంద మూవీ మేకింగ్ చిన్న చిన్న తప్పులున్నాయని..అయినప్పటికీ ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందని భావించినట్టు చెప్పుకొచ్చారు గోపిచంద్. 

Also Read :  Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!

Visitors Are Also Reading