Home » అతిగా చెమట పడుతోందా..? అయితే ఇలా మీరు తగ్గించుకోవచ్చు…!

అతిగా చెమట పడుతోందా..? అయితే ఇలా మీరు తగ్గించుకోవచ్చు…!

by Sravya
Ad

కొంతమందికి ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. మీకు కూడా చెమట ఎక్కువగా పడుతుందా..? దీనిని ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఇలా చేయాల్సిందే చెమట పట్టడం మంచిదే కానీ అతిగా చెమట పట్టడం వలన అనేక సమస్యలు కలుగుతాయి. కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పొచ్చు. ఒకవేళ కనుక మీకు అతిగా చెమట పడుతున్నట్లయితే కొన్ని చిట్కాలు ని పాటించండి అప్పుడు చెమట పట్టడం బాగా తగ్గుతుంది. ఆహారంలో ఉప్పుని బాగా తగ్గిస్తే మంచిది.

Advertisement

Advertisement

ఉప్పు ఎక్కువ తింటే చెమట పడుతుంది ఉప్పు లిమిట్ గానే తీసుకోవాలి. ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా చెమట బాగా పడుతుంది. ఆల్కహాల్ బాడీలోని నీటిని తొందరగా చెమట రూపంలో బయటికి పంపించేస్తుంది. చెమట ఎక్కువగా పడుతున్నట్లయితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. ఆకుకూరలు, బ్రౌన్ రైస్, తాజా కూరలు ఇటువంటి వాటిని తీసుకోవడం మంచిది. గ్రీన్ టీ ని అలవాటు చేసుకోండి కాఫీ టీ లలో కెఫీన్ ఎక్కువ ఉంటుంది. దీంతో ఎక్కువ చెమట పడుతుంది. ఎక్కువ చెమట పడుతున్నట్లయితే ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకోండి అతిగా చెమట పట్టడం జరుగుతున్నట్లయితే శారీరిక శ్రమ చేయడం అలవాటు చేసుకోవాలి.

Also read:

Visitors Are Also Reading