టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో పెళ్లిసందD నటించిన బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
డిసెంబర్ 23న భారీ అంచనాల మధ్య విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఈ ధమాకా చిత్రానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.30కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10కోట్ల వరకు పలికాయట. మరోవైపు శాటిలైట్, డిజిటల్ హక్కులు రూ.20కోట్ల వరకు పలికాయి. క్రాక్ తరువాత రవితేజ నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాకి ఈ ధర పలకడం మామూలు విషయం కాదనే చెప్పవచ్చు.
Advertisement
Also Read : కాంతార సినిమాకు రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ అంత తక్కువా..? ఎన్ని కోట్లంటే..?
మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు దర్శకుడు నక్కిన త్రినాథ రావు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు ప్రసన్నకుమార్ బెజవాడ అందించారు. ముఖ్యంగా రవితేజ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. రవితేజ నటించిన ధమాకా చిత్రం మరికొద్ది గంటల్లోనే విడుదల కానుంది. మరీ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Also Read : నటి జయప్రదకు ఊహించని షాక్…కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్..!