Home » కాంతార సినిమాకు రిష‌బ్ శెట్టి రెమ్యున‌రేష‌న్ అంత త‌క్కువా..? ఎన్ని కోట్లంటే..?

కాంతార సినిమాకు రిష‌బ్ శెట్టి రెమ్యున‌రేష‌న్ అంత త‌క్కువా..? ఎన్ని కోట్లంటే..?

by AJAY

కొన్ని సినిమాలు ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు అవుతుంటాయి. అలాంటి సినిమాల‌లో కాంత‌ర కూడా ఒకటి. ఈ సినిమా క‌న్న‌డ సినిమాగా వ‌చ్చి పాన్ ఇండియా లెవ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ చిత్రంలో రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించాడు. అంతే కాకుండా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం కూడా రిష‌బ్ శెట్టినే వ‌హించాడు. క‌ర్నాట‌క‌లోని ఓ తెగ‌వారి సంప్ర‌దాయం క‌ల్చ‌ర్ ను ఆధారంగా చేసుకుని రిష‌బ్ శెట్టి ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాడు.

మొద‌ట ఈ సినిమాను కేవ‌లం క‌న్న‌డ లోనే విడుద‌ల చేశారు. కానీ ఆ త‌ర‌వాత సినిమాకు వ‌చ్చిన టాక్ తో తెలుగుతో పాటూ హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల చేశారు. కాగా అంత‌టా ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. సినిమాకు ఖ‌ర్చు చేసిన బ‌డ్జెట్ కేవ‌లం రూ.16 కోట్లు కాగా భారీగా లాభాలు వ‌చ్చాయి. మొత్తం ఈ సినిమాకు రూ.400 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. సినిమాలోని క‌థ పాట‌లు…న‌ట‌న ఇలా ప్ర‌తి ఒక్క‌టి ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడి మ‌రియు హీరోగా న‌టించిన రిష‌బ్ శెట్టి రెమ్యున‌రేష‌న్ తెలిస్తే అవాక్క‌వ్వ‌క త‌ప్ప‌దు. ఈ సినిమా లో న‌టించ‌డం తో పాటూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించినందుకు ఆయ‌న తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కేవ‌లం రూ.4 కోట్లే అని టాక్.

అంతే కాకుండా సినిమాకు నాలుగు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చినా ఆ తరవాత కూడా రిష‌బ్ శెట్టికి నిర్మాత‌లు అద‌నంగా రెమ్యున‌రేషన్ ఇవ్వ‌డం గానీ కాస్ట్లీ గిఫ్ట్ లు ఇవ్వ‌డం కానీ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఇక రెమ్యున‌రేష‌న్ విష‌యం ప‌క్క‌న పెడితే ఈ సినిమా తోనే రిష‌బ్ శెట్టి అంటే దేశ‌వ్యాప్తంగా క్రేజ్ వ‌చ్చింది. ఆ క్రేజ్ తో ఆయ‌న స్టార్ హీరోల‌కు క‌థ‌లు వినిపిస్తున్నాడు. అంతే కాకుండా ఆయ‌న రెమ్యున‌రేష‌న్ కూడా పెంచిన‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading