Home » పోస్టుమార్టం లో ఎలా అంతా తెలిసిపోతుంది..? అసలు ఏం చేస్తారంటే..?

పోస్టుమార్టం లో ఎలా అంతా తెలిసిపోతుంది..? అసలు ఏం చేస్తారంటే..?

by Sravya
Ad

హత్య చేసిన చంపేస్తే పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా ఆ నిందితుడిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అసలు పోస్టుమార్టం అంటే ఏంటి.. ఎలా నేరస్తుల్ని కనిపెడతారు..? పైగా మొత్తం నేరాన్ని ఎలా కనుక్కుంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుమార్టం ద్వారా ఎలా చనిపోయారు..? ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోయారు..? చనిపోవడానికి ముందు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలుస్తాయి. పాథాలజీ డాక్టర్లు మాత్రమే పోస్టుమార్టం చేస్తారు. పోస్టుమార్టం ఎప్పుడైనా చేయాల్సి వస్తే దాన్ని మెడికో లీగల్ అటాప్సీ అని అంటారు.

Advertisement

వ్యాధికి సంబంధించిన వివరాలు ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే క్లినికల్ పోస్టుమార్టం అంటారు. మెడికల్ స్టూడెంట్స్ శవపరీక్ష చేస్తూ ఉంటారు దానిని అనటామికల్ పోస్టుమార్టం అంటారు. ఇలా రకాలు ఉన్నాయి. పోలీసులు లేదా కోర్టుల అభ్యర్థన మేరకు చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారు. అయితే కేసును బట్టి పోస్టుమార్టం సమయం పడుతుంది. మొదట చనిపోయిన వ్యక్తి మీద గాయాలు, గుర్తులు ఏమైనా ఉంటే వాటిని నమోదు చేస్తారు. అలానే చనిపోయిన వ్యక్తి బరువు ఇటువంటివన్నీ కూడా చూస్తారు. పోస్టుమార్టం అయిపోయిన తర్వాత శరీరానికి కుట్లు వేసి డ్రెస్సింగ్ చేస్తారు.

Advertisement

భుజాల దగ్గర నుండి రొమ్ముల మీదుగా మర్మాంగం దాకా శరీరాన్ని యు షేప్ లో లేదా వై షేప్ లో కోస్తారు. చర్మం లోపల కండర భాగాన్ని తీసేస్తారు. శరీరంలో ముఖ్యమైన భాగాలు అన్నిటిని కూడా బయటకి తీయడం జరుగుతుంది. పుర్రె వెనుక భాగాన్ని ఒక చెవి నుండి ఇంకో చెవి వరకు కోస్తారు. పై భాగాన్ని పైకి తీసేస్తారు కింద భాగాన్ని కిందకి తీసేస్తారు. పుర్రెను తీసేసి మెదడుని బయటికి తీస్తారు. అయితే కేసును బట్టి శరీర భాగాల్లో పరీక్షలు ఉంటాయి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి అనుమానంగా ఉన్న వాటిని పంపిస్తారు పోస్టుమార్టం అయిపోయాక మళ్ళీ తీసేసిన భాగాన్ని లోపల పెట్టడం పరిస్థితిని బట్టి ఉంటుంది.

Also read:

Visitors Are Also Reading